టాంజానియా ఆర్థిక రాజధాని దార్ ఎస్ సలాంలో ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై బోల్తాపడిన ఇంధన ట్యాంకర్ పేలి 62 మంది మరణించారు. సుమారు 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది.
"మొరాగోరో పట్టణానికి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. బోల్తాపడిన ట్యాంకర్ నుంచి స్థానికులు ఇంధనం సేకరించడానికి గుమిగూడారు. ఆ సమయంలో ఎవరో సిగరెట్ వెలిగించడం వల్ల ట్యాంకర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 62 మంది మరణించారు."- పోలీసులు
'ఇంధనాన్ని సేకరించడానికి వచ్చిన 'బోడా-బోడా' టాక్సీ డ్రైవర్లు, స్థానికులే ఈ ప్రమాదం బారిన పడ్డారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి' అని పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి సమీపంలోని ద్విచక్రవాహనాలు, చెట్లు కాలి బూడిదయ్యాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
గత నెలలో జరిగిన ప్రమాదంలో.... పెట్రోల్ ట్యాంకర్ పేలి, 45 మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.
ఇదీ చూడండి: దిల్లీ-లాహోర్ బస్సుకు బ్రేక్ వేసిన పాక్