సైనిక తిరుగుబాటుతో సుడాన్ ఉలిక్కిపడింది(sudan coup 2021). ఆ దేశ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అబ్దుల్లా హమ్డోక్తో పాటు అనేకమంది సీనియర్ అధికారులను సైనికులు అరెస్ట్ చేశారు(sudan latest news). దేశంలోని అనేక ప్రాంతాల్లో అంతర్జాల సేవలు నిలిచిపోయాయి. వంతెనలను మూసివేశారు(sudan military power). ప్రధాని ఎక్కడున్నారనే వివరాలు తెలియడం లేదని సుడాన్ సమాచార మంత్రిత్వశాఖ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.

ఎమర్జెన్సీ విధింపు
సుడాన్ ప్రధాని సహా ముఖ్య నేతలను సైన్యం అరెస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత కీలక ప్రకటన చేశారు ఆర్మీ అధినేత జనరల్ అబ్దెల్ ఫతాహ్ బుర్హాన్. దేశంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. 'దేశ అధికార మండలితో పాటు ప్రధాని అబ్దుల్లా హమ్డోక్ నేతృత్వంలోని ప్రభుత్వాని రద్దు చేస్తున్నాం. రాజకీయ వర్గాల మధ్య తగాదాలు సైన్యాన్ని జోక్యం చేసుకోవడానికి ప్రేరేపించాయి. అయినప్పటికీ, దేశంలో ప్రజాస్వామ్యం దిశగా సాగే ప్రక్రియను పూర్తి చేస్తాం. కొత్త టెక్నోక్రాట్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుంది.' అని పేర్కొన్నారు.

నిరసనలకు పిలుపు..
సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టాలని దేశంలోని ప్రజాస్వామ్య పార్టీలు పిలుపునిచ్చాయి. ఖార్టూమ్, అమ్డుర్మన్ నగరాల్లోని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. పరిస్థితిని అదుపుచేసేందుకు భద్రతాదళాలు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది(sudan military news).

రెండేళ్ల క్రితమే ఒమర్ అల్ బషీర్ సుదీర్ఘ పాలన నుంచి బయటపడి ప్రజాస్వామ్యంవైపు అడుగులు వేస్తోంది సుడాన్. ఈ తరుణంలో సైనిక తిరుగుబాటు జరగడం ఆ దేశానికి ప్రతికూలంగా మారనుంది. సైనికాధికారులు తిరుగుబాటుకు సెప్టెంబర్‌లోనే ప్రయత్నించినా అది విఫలమైంది. అప్పటి నుంచి సుడాన్ రాజకీయ నేతలు, మిలిటరీ అధికారుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆ దేశం సైనిక పాలనలోకి జారుకుంది(sudan military coup).

'పరిస్థితులు ఆందోళనకరం..'
సుడాన్లో తాజా పరిణామాలపై అమెరికా, ఐరోపా సమాఖ్య ఆందోళన వ్యక్తం చేశాయి. దేశంలో పరిస్థితులు చూసి దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించారు సుడాన్‌కు అమెరికా ప్రత్యేక రాయబారి జెఫ్రి ఫెల్ట్‌మన్. దేశంలో సైనిక తిరుగుబాటుతో పరిస్థితులు మరింత దారుణంగా మారతాయన్నారు. మరోవైపు సుడాన్లో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నట్టు ఐరోపా విదేశాంగ చీఫ్ జోసెఫ్ బోరెల్ ట్వీట్ చేశారు.

ఇదీ చూడండి:- గినియాలో సైనిక తిరుగుబాటు- ప్రభుత్వం రద్దు!