ETV Bharat / international

ఆహార ప్యాకెట్లకు భారీగా తరలివచ్చిన జనం-తొక్కిసలాట - కెన్యా నైరోబీ

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కెన్యాలో లాక్‌డౌన్‌ విధించింది అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మురికివాడల్లో నివసించే పేదవారి కోసం.. ఆ దేశ ప్రభుత్వం ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టింది. అదే సమయంలో భోజన ప్యాకెట్లు అందుకునేందుకు ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఫలితంగా తొక్కిసలాట జరిగి పలువురికి గాయలయ్యాయి. పాకిస్థాన్​లోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుని ఓ మహిళ మృతి చెందింది.

Stampede in Kenya as slum residents surge for food aid
కెన్యాలో ఆహార పంపిణీ కార్యక్రమలో తీవ్ర అపశృతి!
author img

By

Published : Apr 10, 2020, 9:51 PM IST

Updated : Apr 10, 2020, 11:42 PM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా.. కెన్యాలో పేదవారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తుండగా తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో అనేకమంది గాయాలపాలయ్యారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కెన్యాలో ఆంక్షలు విధించడం వల్ల అక్కడి పేద ప్రజలకు పూట గడవడం కష్టతరంగా మారింది. నైరోబీలోని కిబెరా మురికి వాడలో నివసించే ప్రజల కోసం స్థానిక అధికారులు ఆహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే భోజన ప్యాకెట్లు అందుకోవడానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. వారంతా ఒక్కసారిగా ఆహారం కోసం ఎగబడ్డందున.. వీరిని అదుపుచేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. తప్పించుకునే క్రమంలో తొక్కిసలాట జరగ్గా.. అనేక మంది గాయపడ్డారు.

కెన్యాలో ఆహార పంపిణీ కార్యక్రమలో తీవ్ర అపశృతి!

పాకిస్థాన్​లోనూ..

పాకిస్థాన్​లోనూ లాక్​డౌన్​ కారణంగా పేద ప్రజలకు నిత్యావసరాలు, ఇతర ఖర్చుల కోసం అక్కడి ప్రభుత్వం 12 వేల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నగదు కోసం తూర్పు పంజాబ్​ ముల్తాన్​లోని ఓ పాఠశాలకు వందలాది మంది మహిళలు వచ్చారు. దీంతో వీరి మధ్య తోపులాట జరగి ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: వైద్యులకు కృతజ్ఞతగా లండన్​లోనూ దీపోద్యమం

Last Updated : Apr 10, 2020, 11:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.