ETV Bharat / international

వైద్యులకు కృతజ్ఞతగా లండన్​లోనూ దీపోద్యమం - Shard Skyscrapper

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బందికి లండన్, న్యూయార్క్​ వాసులు ధన్యవాదాలు తెలిపారు. చారిత్రక కట్టడాలను నీలి రంగు విద్యుత్​ దీపాలతో అలంకరించి, చప్పట్లు కొట్టి సంఘీభావం తెలియజేశారు.

London and New York Landmarks were lit blue
కరోనాపై పోరుకు భారత్‌ తరహాలోనే యూఎస్‌, యూకే!
author img

By

Published : Apr 10, 2020, 1:19 PM IST

Updated : Apr 10, 2020, 3:15 PM IST

కరోనాపై ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బందికి అన్ని దేశాల ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. బ్రిటన్‌ జాతీయ ఆరోగ్య సంస్థ ఉద్యోగులు, అత్యవసర సిబ్బంది సేవలకు గుర్తుగా గురువారం సాయంత్రం లండన్‌ వీధులు నీలిరంగు కాంతులతో దర్శనమిచ్చాయి. 'లండన్‌ ఐ ఫెర్రిస్‌ వీల్‌', 'ది షార్డ్‌ స్కైస్క్రాపర్‌' భవనాలు విద్యుత్ దీపాలంకరణతో కనిపించాయి.

కరోనా లక్షణాలతో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ చికిత్స పొందుతున్న సెయింట్‌ థామస్‌ ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది కూడా ఆ సమయంలో బయటకు వచ్చి మద్దతు పలికారు. వైద్యుల సేవలకు కృతజ్ఞతగా లండన్‌ వాసులంతా తమ ఇళ్లలోనే ఉండి చప్పట్లు కొట్టారు.

వైద్యులకు కృతజ్ఞతగా లండన్, న్యూయార్క్​లోనూ దీపోద్యమం

న్యూయార్క్‌లోనూ..

కొవిడ్‌-19పై పోరాటం చేస్తున్న వారికి అమెరికన్‌ ప్రజలూ ధన్యవాదాలు తెలిపారు. యూఎస్‌లో వైరస్‌కు హాట్​స్పాట్ అయిన న్యూయార్క్‌లోని చారిత్రక భవనాలను ప్రత్యేకంగా ఎరుపు, తెలుపు, నీలి రంగు విద్యుత్ దీపాలతో అలంకరించారు.

ఇదీ చదవండి: అమెరికాలో ఒక్కరోజే 1900 మంది బలి

Last Updated : Apr 10, 2020, 3:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.