ETV Bharat / international

మిత్రుల ఇంట్లో భోజనం చేసిన మంత్రి సస్పెన్షన్​​!

ప్రపంచ మహమ్మారి కరోనాను అరికట్టేందుకు దాదాపు అన్ని దేశాలు లాక్​డౌన్​నే ఆయుధంగా ఎంచుకొన్నాయి. ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే శిక్షించేందుకూ ఏమాత్రం  వెనుకాడట్లేదు ఆయా ప్రభుత్వాలు. అందులో భాగంగానే దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మంత్రిని సస్పెండ్​ చేయడమే కాక జరిమానా విధించారు అధికారులు.

South Africa minister fined over lockdown lunch visit
మిత్రుల ఇంట్లో భోజనం చేసినందుకు మంత్రికి జరిమానా​!
author img

By

Published : Apr 23, 2020, 9:07 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో లాక్​డౌన్​ అమల్లో ఉంది. అయితే..​ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు మంత్రినీ వదల్లేదు అధికారులు. తన మిత్రుల ఇంట్లో భోజనం చేసిన ఆ దేశ ప్రసార, సాంకేతిక శాఖ మంత్రి స్టెల్లా ఎందబెని-అబ్రహమ్స్​ను సస్పెండ్​ చేశారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 'స్టే ఎట్​ హోమ్​' ఆర్డర్​లో భాగంగా ప్రత్యేక సెలవుల్లో ఉన్నారు అబ్రహమ్స్​. అయితే, లాక్​డౌన్​ రెండో వారంలో ఆమె.. మాజీ మంత్రి ఇంట్లో భోజనం చేయడమే కాక ఆ చిత్రాన్ని ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నారు. ఈ ఫొటోను చూసిన అధికారులు.. నిబంధనల్ని ఉల్లంఘించిన కారణంగా మంత్రిని సస్పెండ్​ చేయడమే కాకుండా, సుమారు 1000 ర్యాండ్​ల( సుమారు 53 డాలర్లు) జరిమానా విధించారు. వచ్చే నెలలో కోర్టు ముందు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు.

3000లకుపైగా కేసులు..

దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 3,465 మంది కరోనా మహమ్మారి బారినపడగా.. 58 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ విస్తృతిని అడ్డుకోవడానికి కొద్ది వారాల క్రితమే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించింది దక్షిణాఫ్రికా.

70 వేల మంది బలగాలు..

35 రోజుల లాక్​డౌన్​లో ప్రస్తుతం 27 రోజులు పూర్తయ్యాయి. దీనిని మరింత కఠినంగా అమలు చేసేందుకు భారీ ఎత్తున సైన్యాన్ని వినియోగిస్తోంది. ఆరంభంలో 2 వేల మందిని ఉపయోగించిన ఆ దేశ ప్రభుత్వం.. ఇప్పుడు సుమారు 70 వేల మంది బలగాలను రోడ్లపై మోహరిస్తున్నట్లు తెలిపింది.

ఈ బలగాలు ప్రజల మధ్య భౌతిక దూరం, స్వీయ నిర్బంధం వంటి వాటిని నిరంతరం పర్యవేక్షించనున్నాయి.

ఇదీ చదవండి: బాలికలపై కరోనా ప్రభావం అధికం: యునెస్కో

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.