ETV Bharat / international

ఆ దేశాలకు ఇప్పటికీ అందని టీకా! - WHO on poor countries

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. కొవిడ్ కట్టడికై అమెరికా లాంటి అగ్రదేశాలు పూర్తి స్థాయి వ్యాక్సినేషన్​పై దృష్టిసారించాయి. కానీ.. ఇప్పటికీ డజనుకు పైగా దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఆఫ్రికాలోని ఆరు దేశాల్లో కనీసం వైద్యులు కూడా టీకా పొందలేని పరిస్థితిలో ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

covid vaccine
టీకా, వ్యాక్సిన్
author img

By

Published : May 9, 2021, 4:46 PM IST

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు చాలా దేశాలు టీకాను అభివృద్ధి చేశాయి. తమ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. కానీ, ఆఫ్రికాలోని కొన్ని పేద దేశాలు ఇప్పటికీ వ్యాక్సిన్లు అందక సతమతమవుతున్నాయి. దాదాపు 12కుపైగా పేద దేశాలకు ఇప్పటివరకు టీకా డోసులు అందలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఇందులో సగానికిపైగా దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నట్లు పేర్కొంది.

ఛాద్, బుర్కినా ఫాసో, బురుంది, ఎరిత్రియా, టాంజానియా దేశాల్లో ఒక్కరికీ టీకా తీసుకునే భాగ్యం కలగలేదు.

టీకాల పంపిణీ ఆలస్యం చేయడం వల్ల ఆఫ్రికా దేశాలను కొవిడ్ చిన్నాభిన్నం చేస్తోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీకాలలో 1 శాతం టీకాలు ఇచ్చినా ఆఫ్రికా పేద దేశాలకు సరిపోతాయని స్పష్టం చేసింది.

కొత్త వేరియంట్లు వస్తే..?

వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకాని దేశాల్లో వైరస్ ఉత్పరివర్తనం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యునిసెఫ్ సంబంధిత కొవాక్స్ కార్యక్రమం కో ఆర్డినేటర్ జియాన్ గాంధీ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు పేద దేశాలకు సాయం చేయాలని కోరారు.

పేద దేశాలకు టీకా అందించడమే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి కొవాక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయినా.. చాధ్​, టాంజానియా, ఎరిత్రియా మొదలైన దేశాలకు వ్యాక్సిన్లు అందకపోవడం గమనార్హం.

వైద్యులకూ డోసులు కరవే..

ఛాద్ దేశంలో మొత్తంగా 4,835 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 170 మంది వైరస్​కు బలయ్యారు. ఆ దేశంలో వైద్య సిబ్బంది చైనా పంపిణీ చేసిన కేఎన్​95 మాస్కులు, శానిటైజర్లు ఉపయోగిస్తున్నారు. కానీ.. దేశంలో కనీసం వైద్య సిబ్బందికి ఇప్పటివరకు టీకా తీసుకునే అవకాశం రాలేదని వాపోతున్నారు.

"ఇప్పటికీ టీకా వేసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. నాకు వ్యాక్సిన్ తీసుకునే అవకాశమే రాలేదు. దేశానికి వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చినా మొదటి డోసు నేను తీసుకుంటా."

--డాక్టర్. ఔమైమా, వైద్యురాలు.

అయితే.. సహారా ఎడారి సమీపంలో ఉన్న ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో టీకాలను సురక్షితంగా పంపిణీ చేయడం కూడా సవాల్​గా మారుతోంది. కోల్డ్ స్టోరేజ్​ సౌకర్యాలు ఏర్పాటు చేస్తే చాధ్​ దేశానికి ఫైజర్​ టీకాను పంపిణీ చేసే అవకాశం ఉంది.

బుర్కినా ఫాసో, హైతి దేశాల్లోనూ టీకాలు అందే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. భారత్ సహా పలు దేశాల్లో టీకాల కొరత, వైరస్​ వ్యాప్తి పెరుగుతుండటమే ఇందుకు కారణం.

ఇదీ చదవండి:జెరూసలెంలో ఘర్షణలు- 200 మందికి గాయాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.