ETV Bharat / international

'ఆఫ్రికా చిన్నారుల్లో పోషకాహార లోపం మరింత తీవ్రం' - ఆఫ్రికా

కోటి మందికిపైగా పిల్లలు 2021లో పోషకాహార సమస్యను ఎదుర్కొంటారని యూనిసెఫ్ తెలిపింది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఈ సమస్య తీవ్రమవనుందని పేర్కొంటూ బుధవారం ప్రకటించింది.

unicef, malnutrition
పౌష్టికాహార సమస్య 2021లో మరింత తీవ్రం
author img

By

Published : Dec 31, 2020, 2:22 PM IST

Updated : Dec 31, 2020, 2:28 PM IST

ఆఫ్రికాలో 2021 సంవత్సరంలో కోటి మందికిపైగా చిన్నారులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతారని యూనిసెఫ్ (యునైడెట్‌ నేషన్స్‌ ఇంటర్నేషనల్​ చిల్డ్రన్స్‌ ఎమర్జెన్సీ ఫండ్‌) అంచనా వేసింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. డెమొక్రటిక్ రిపబ్లిక్​ ఆఫ్ కాంగో, నైజీరియా, దక్షిణ సూడాన్, యెమెన్ దేశాలు సహా సెంట్రల్ సహేల్ ప్రాంతాలను ఆ జాబితాలో పేర్కొంది.

ప్రస్తుతం సెంట్రల్ సహేల్ మినహా మిగతా ప్రాంతాలు అన్నీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని తెలిపింది.

"ఇప్పటికే ఆహార సంక్షోభంలో ఉన్న దేశాలకు కొవిడ్​ 19 తీవ్ర విపత్తు దాపురించేలా చేసింది. ఆహారం కోసం ప్రజలు పడుతున్న ఇక్కట్లు ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నాయి. 2020 బాధితులుగా మనం వారిని వదిలేయలేం."

-హెన్రిటా ఫోరె, యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్

సేవలను విస్తరించేందుకు..

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సామాజిక కార్యకర్తలకు యూనిసెఫ్ పిలుపునిచ్చింది. 2021లో పౌష్టికాహార సమస్యకు ప్రభావితమయ్యే ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు రూ.7,300 కోట్లను విరాళంగా సేకరించనుంది.

ఇదీ చదవండి : అందరికీ పోషకాలు అందేదెలా?

Last Updated : Dec 31, 2020, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.