ETV Bharat / international

'ఎవర్​ గివెన్​'కు ఎందుకు అలా జరిగింది? - సూయిజ్ కెనాల్​లో ఎవర్ గివెన్

సూయిజ్‌ కాలువలో 'ఎవర్‌ గివెన్‌' అడ్డం తిరగడంపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనకు గల కారణాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ భారీ నౌక మార్చి 23న అడ్డం తిరిగి, దాని ముందు భాగం కాలువకు ఓ వైపు కూరుకుపోయింది. ఫలితంగా ప్రపంచవాణిజ్యానికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి.

ever given
'ఎవర్​ గివెన్​'కు ఎందుకు అలా జరిగింది?
author img

By

Published : Mar 31, 2021, 8:52 AM IST

ఈజిప్ట్‌లోని సూయిజ్‌ కాలువలో భారీ కంటైనర్‌ నౌక 'ఎవర్‌ గివెన్‌' ఎందుకు అడ్డం తిరిగిందనే విషయమై విచారణ ప్రారంభమైంది. సాంకేతిక అంశాలతో పాటు, నౌక ఎంతవరకూ భద్రమన్న విషయాన్ని కూడా నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆకాశహర్మ్యం లాంటి ఈ భారీ నౌక ఈనెల 23న అడ్డం తిరిగి, దాని ముందుభాగం కాలువకు ఓ వైపున ఇసుక, బంక మట్టిలో కూరుకుపోయింది. ఫలితంగా వందలాది నౌకలు నిలిచిపోయి, ప్రపంచ వాణిజ్యానికి ఇబ్బందులు తలెత్తాయి. అనేక సంస్థలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. తీవ్ర ప్రయత్నాలు ఫలించి.. సుమారు వారం రోజుల తర్వాత ఈ నౌక సోమవారం మళ్లీ ప్రయాణం ఆరంభించింది. గ్రేట్‌ బిట్టర్‌ లేక్‌కు చేరుకున్న ఈ నౌకలోకి నిపుణులు మంగళవారం ప్రవేశించి.. లోపం ఎక్కడ తలెత్తింది? పగుళ్లు ఏమైనా ఏర్పడ్డాయా? ఇంజిన్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? ఒంటరిగానే ఇది ప్రయాణం సాగించగలదా? మరో నౌక సాయంతో తీసుకెళ్లాలా? అన్న విషయాలను పరిశీలిస్తున్నారు. నౌకలు ప్రయాణాన్ని నిలిపివేయాల్సిన పరిణామం న్యాయపరమైన అంశాలతో కూడుకున్నది కావడంతో.. సమస్య ఎలా తలెత్తిందనే విషయమై ఈజిప్ట్, షిప్పింగ్, బీమా సంస్థల అధికారులు కూడా విచారణ చేపడుతున్నారు.

భారీగానే నష్టపరిహారం?

ఎవర్‌ గివెన్‌... జపాన్‌కు చెందిన షోయీ కిసెన్‌ కైసా లిమిటెడ్‌ది కాగా, తైవాన్‌కు చెందిన ఎవర్‌ గ్రీన్‌ సంస్థ నడుపుతోంది. ఇది అడ్డం తిరిగిన నేపథ్యంలో- నౌక, కాలువ మరమ్మతులకు అయ్యే ఖర్చును సంబంధిత సంస్థల నుంచి రాబట్టే అవకాశముంది. ఇతర నౌకా సంస్థలు కూడా పరిహారం కోరవచ్చని భావిస్తున్నారు. సూయిజ్‌ కెనాల్‌ అథారిటీకి నౌక యాజమాన్య సంస్థ భారీగా పరిహారం, జరిమానా చెల్లించాల్సి రావొచ్చని అంతర్జాతీయ న్యాయ సంస్థ 'క్లైడ్‌ అండ్‌ కో' పేర్కొంది.

భారతీయ సిబ్బందికి ప్రశంసలు..

ఎవర్‌ గివెన్‌లో 25 మంది సిబ్బంది ఉండగా, వారంతా భారతీయులే! నౌకను తిరిగి యథాస్థితికి తీసుకురావడంలో వీరు ఎంతో ఉత్సాహంగా, నిర్విరామంగా తమతో పాటు కృషి చేశారంటూ... ఈ నౌక సాంకేతిక నిర్వహణ సంస్థ బెర్న్‌హార్డ్‌ షుల్టే షిప్‌మెంట్‌ (జర్మనీ) ధన్యవాదాలు తెలిపింది.

ఆ పది నిమిషాలు తీవ్ర ఉత్కంఠ.. హారన్ల మోత..

ఈ భారీ కంటైనర్‌ను టగ్‌ బోట్లు కదిలించిన తర్వాత.. దాన్ని నియంత్రించడం కత్తి మీద సాములా మారింది. ఆ క్షణంలో నౌకను నియంత్రించలేకపోతే భారీ ప్రమాదమే జరిగి ఉండేది. ఓడ రెండో చివరిభాగం... సూయిజ్‌ కాలువ అంచును ఢీకొట్టే పరిస్థితి వచ్చేది. దీంతో నౌక కదిలిన తర్వాత పది నిమిషాల పాటు తీవ్ర ఉత్కంఠ రేకెత్తింది. కానీ, అంతా సవ్యంగా జరగడంతో ఈ క్రతువులో పాల్గొన్నవారంతా తమ శ్రమను మర్చిపోయి, కేరింతలు కొట్టారు. నౌకల హారన్లు మోగించి హర్షధ్వానాలు వినిపించారు.

ఇదీ చదవండి:భారత్​లో మానవ హక్కుల సమస్యలు: అమెరికా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.