పేద దేశాలకు కరోనా టీకా అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటైన 'కొవాక్స్' కార్యక్రమానికి భారత్ తనవంతు సహకారాన్ని అందించింది. ఈ మేరకు ఆస్ట్రాజెనెకా-సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో ఉత్పత్తైన టీకాలను పశ్చిమాఫ్రికా దేశమైన 'ఘనా'కు సరఫరా చేసింది.
యూనిసెఫ్ ఆధ్వర్యంలో పంపిణీ అయిన ఈ 6 లక్షల టీకాలు బుధవారం తెల్లవారుజామున ఎక్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
ఇదీ చదవండి: ఆఫ్రికాలో లక్ష మార్క్ దాటిన కరోనా మరణాలు