ETV Bharat / international

మరో ప్రాణాంతక వైరస్​- ఆఫ్రికాలో తొలి కేసు - ఆఫ్రికాలో మార్​బర్గ్​ వైరస్ తొలి కేసు

ఆఫ్రికా దేశం గినియాలో ప్రాణాంతక మార్​బర్గ్​​ వైరస్ తొలి కేసు నమోదైంది. ఈ మేరకు గినియా సర్కారు ప్రకటించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) వెల్లడించింది.

Marburg virus
మార్​బర్గ్​​ వైరస్
author img

By

Published : Aug 10, 2021, 11:52 AM IST

Updated : Aug 10, 2021, 1:19 PM IST

ఇప్పటికే కరోనాతో సతమతమవుతుండగా.. ఆఫ్రికా దేశం గినియాలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగుచూసింది.​ ఓ వ్యక్తికి మార్​బర్గ్​ వైరస్​ సోకినట్లు గినియా సర్కారు తెలిపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ప్రకటించింది. ఆగస్టు 6న.. మార్​బర్గ్​ వైరస్​​ వ్యాధి(ఎంవీడీ) నిర్ధరణ అయినట్లు డబ్ల్యూహెచ్​ఓకు గినియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసినట్లు పేర్కొంది. ఈ వైరస్​ వ్యాప్తి నియంత్రణకు తక్షణమే చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించింది.

ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజే మరణం

గతనెల 25న... సియెర్రా లియోన్​, లైబీరియన్ సరిహద్దులకు సమీపంలోని ఎన్​జెరెకోర్​ ప్రాంతంలోని ఓ వ్యక్తిలో ఎంవీడీ లక్షణాలు కనిపించగా.. ఆగస్టు 1న జ్వరం, తలనొప్పి, అలసట, కడుపు నొప్పి, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి లక్షణాలతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పరీక్షించగా.. మార్​బర్గ్​ వైరస్​గా తేలింది. దీంతో రీహైడ్రేషన్​​, పేరెంటరల్​​ యాంటీబయాటిక్స్​​ సాయంతో బాధితుడికి చికిత్స అందించినట్లు అధికారులు తెలిపారు. అయితే మరుసటి రోజే అతను మరణించినట్లు పేర్కొన్నారు.

ఈ విషయమై లోతుగా పరిశోధన చేయడానికి జాతీయ వైద్యాధికారులతో పాటు డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం కూడా అక్కడికి వెళ్లింది. ఆ మృతదేహం నుంచి లాలాజల నమూనాలు సేకరించి.. మార్​బర్గ్​తో పాటు ఎబోలా పరీక్షలు చేశారు. ఇందులో మార్​బర్గ్​ పాజిటివ్​గా తేలిందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది.

నియంత్రణ చర్యలు

గినియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డబ్ల్యూహెచ్​ఓ, అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ సహా పలు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు సంయుక్తంగా.. ఈ వైరస్​ వ్యాప్తి నియంత్రణకు చర్యలు ప్రారంభించాయి. ఎంవీడీతో చనిపోయిన వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉన్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

అత్యంత ప్రమాదకరమైన వైరస్​

ఎంవీడీ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి అని తెలిపిన డబ్ల్యూహెచ్​ఓ.. తీవ్ర స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. గతంలో జర్మనీ సహా పలు ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్​ బయటపడినట్లు తెలిపింది.

ఇదీ చూడండి: చైనాలో ప్రమాదకర ఆంత్రాక్స్ నిమోనియా కేసు

Last Updated : Aug 10, 2021, 1:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.