ETV Bharat / international

జైలులో మంటలు.. 38మంది ఖైదీలు సజీవ దహనం

author img

By

Published : Dec 7, 2021, 11:01 PM IST

BURUNDI PRISON FIRE: ఆఫ్రికా దేశం బురుండి జైలులో జరిగిన ఓ ప్రమాదంలో 38 మంది మృతి చెందారు. భారీగా ఎగసి పడుతున్న మంటల ధాటికి.. తలుపులు తీయమని వేడుకున్నప్పటికీ పోలీసులు నిరాకరించారని.. దీనివల్ల మృతుల సంఖ్య భారీగా పెరిగిందని ఓ ఖైదీ వాపోయాడు.

PRISON FIRE
జైలులో మంటలు

FIRE IN BURINDI JAIL: తూర్పు ఆఫ్రికా దేశమైన బురుండిలో పెను విషాదం జరిగింది. ఆ దేశ రాజధాని కేంద్ర కారాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఖైదీలంతా నిద్రిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 38మంది ఖైదీలు సజీవదహనమయ్యారు. మరో 69మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

PRISON FIRE
జైలు వద్దకు చేరుకున్న సైనికులు

BURUNDI PRISON FIRE: జైలులో ఖైదీలు మంటల్లో కాలిపోయారు.. క్షతగాత్రుల్ని పోలీసులు, సైన్యం ట్రాక్టర్లలో ఆస్పత్రికి తరలిస్తున్నారంటూ ఓ ప్రత్యక్ష సాక్షి ఫోన్‌లో చెప్పినట్టు ఏఎఫ్‌పీ మీడియా సంస్థ పేర్కొంది. అయితే, ఈ మంటలు చెలరేగడానికి కారణాలేంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

PRISON FIRE
జైలులో మంటలు

RED CROSS AT BURUNDI PRISON: మరోవైపు.. భారీగా ఎగసి పడుతున్న అగ్నికీలలను చూసిన ఖైదీలు కేకలు పెట్టినా ఫలితం లేకపోయింది. వారి బ్యారక్​లను తెరిచేందుకు పోలీసులు నిరాకరించారని ప్రత్యక్షసాక్షి(ఖైదీ) పేర్కొన్నట్టు ఆ మీడియా సంస్థ తెలిపింది. సమాచారం అందుకున్న రెడ్‌ క్రాస్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి.

PRISON FIRE
జైలు లోపలి దృశ్యాలు

ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించగా.. స్వల్ప గాయాలైన వారికి అక్కడే చికిత్స అందిస్తున్నారు. ఆ దేశ ఉపాధ్యక్షుడు ప్రోస్పెర్‌ బజోంబాంజాతో పాటు కొందరు మంత్రులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.