ETV Bharat / international

పాఠశాలలో అగ్నిప్రమాదం.. 20 మంది చిన్నారులు మృతి - అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి

నైజర్ దేశంలో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మారాడి నగరంలో ఓ పాఠశాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. అదే నగరంలో బంగారు గని కూలి 18 మంది మరణించారు.

38 people killed in two different incidents in Niger
రెండు వేర్వేరు ప్రమాదాల్లో 38 మంది మృతి
author img

By

Published : Nov 9, 2021, 12:40 PM IST

ఆఫ్రికా దేశం నైజర్​లో జరిగిన రెండు వేర్వేరు దుర్ఘటనల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.

పాఠశాలలో అగ్ని ప్రమాదం

దేశంలోనే రెండో అతిపెద్ద నగరం మారాడిలోని ఓ పాఠశాలలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 20 మంది పిల్లలు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతులంతా మూడు నుంచి ఎనిమిదేళ్ల లోపు చిన్నారులేనని అధికారులు తెలిపారు.

Fire accident in Niger
అగ్నిప్రమాదంలో దగ్ధమైన పాఠశాల

గడ్డితో నిర్మించిన పాఠశాలలోని మూడు తరగతి గదులు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలకు కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

Fire accident in Niger
అగ్నికి ఆహుతైన పాఠశాల

బంగారు గని కూలి.. 18 మంది మృతి

అదే నగరంలో బంగారు గని కూలి.. 18 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. నైజీరియా సరిహద్దుకు సమీపంలో ఇటీవల కనుగొన్న బంగారు గని తవ్వుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. వేలాది మంది ఈ గనిలో పని చేయడానికి వెళ్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Niger Goldmine collapse
కూలిన బంగారు గని
Niger Goldmine collapse
సహాయక చర్యలు చేపడుతున్న స్థానికులు

ప్రమాద స్థలాన్ని మారాడి ప్రాంత గవర్నర్​ అబువాకర్​ చౌబే పరిశీలించారు. సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.

Niger Goldmine collapse
పని కోసం బంగారు గని వద్దకు చేరుకున్న కార్మికులు

ఇదీ చూడండి: అధునాతన ఆయుధ తయారీలో చైనా దూకుడు.. టార్గెట్​ అమెరికానే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.