కొద్ది వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు డీఆర్ కాంగోలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు సంభవించి ఇప్పటి వరకు 46మంది ప్రాణాలు కోల్పోయారు. 3,600 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
దక్షిణ కివులోని యువిరా ప్రాంతం వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ రాష్ట్రంలో గత శుక్రవారం నాటికి 24మంది చనిపోయారు. ఇప్పుడు ఇతర ప్రాంతాలతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 46కు చేరింది.
యెమెన్‌లోనూ ఏడుగురు మృతి
యెమెన్‌లోనూ ఈ నెలలో భారీ వరదలు సంభవించాయి. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. హుతీ తిరుగుబాటుదారులకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరుతో 2014 నుంచి యుద్ధభూమిగా మారిన ఈ దేశంలో ఏప్రిల్ 10న తొలి కరోనా కేసు నమోదైంది. ఉద్రిక్త పరిస్థితులు, వైద్య సదుపాయాల కొరత నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేయడం ఆ దేశానికి సవాల్‌గా మారింది.