నైజీరియాలోని కట్సినాలో ప్రభుత్వ పాఠశాలపై దాడి చేసి, విద్యార్థులను అపహరించుకుని పోయింది తామేనని ఆ దేశానికి చెందిన బోకోహారం జిహదీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారని ఆన్లైన్ దినపత్రిక ఒకటి మంగళవారం తెలిపింది. ఈ మేరకు తమకు బోకోహారం నాయకుడు అబూబాకర్ షేక్యూ నుంచి ఓ ఆడియో సందేశం అందినట్లు 'ద డైలీ నైజీరియన్ ' వెల్లడించింది.
పాశ్చాత్య విద్య ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధమని, అందువల్లే విద్యార్థులను అపహరించినట్లు ఆ సందేశంలో ఉన్నట్లు వివరించింది. తాజా సందేశం నిజమైనదా? కాదా? అనే విషయమై స్పష్టత లేకున్నా.. గతంలో అబూబాకర్ అనేక సందర్భాల్లో ఆడియో, వీడియో సందేశాలు విడుదల చేశారు. మరోవైపు, నైజీరియా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి గార్బా షేహూ మాట్లాడుతూ.. విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు చర్చలు ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: పాఠశాలపై దాడి- 400 మంది చిన్నారులు కిడ్నాప్!