ఆఫ్రికా దేశం ఈక్వటోరియల్ గినియాలో రక్తపాతం చోటు చేసుకుంది. సైనిక శిబిరాల్లో జరిగిన పేలుళ్లు భారీగా ప్రాణ నష్టానికి కారణమయ్యాయి.
ఈ ఘటనలో కనీసం 20 మంది మరణించారని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. 400 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు.
ఇదే కారణం
డైనమైట్ నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే పేలుళ్లు జరిగాయని ఆ దేశ అధ్యక్షుడు టియోడొరో ఒబియాంగ్ గువేమా తెలిపారు. ఘటన జరిగిన బాటా నగరం అంతటా పేలుడు ప్రభావం కనిపిచిందని చెప్పారు.
ఇప్పటికే కరోనా ధాటికి అతలాకుతలమైన తమ దేశాన్ని ఈ సంక్షోభ సమయంలో ఆదుకోవాలని విదేశాంగ మంత్రి సిమె ఎన్ ఒయోనో ఎసోనో ఆంగ్యూ కోరారు. వివిధ దేశాల రాయబారులను ఆయన కలిశారు.