సోమాలియాలోని గాల్కాయో నగరంలో జరిగిన ఆత్మాహుతి దాడికి 15మంది బలయ్యారు. నగరంలోని ఓ క్రీడా స్టేడియం ప్రాంగణంలో ఈ పేలుడు జరిగింది. మృతుల్లో సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ దాడిని తామే జరిపినట్లు అల్-షబాబ్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ప్రధానికి తప్పిన అపాయం..
ఈ ఘటనలో సోమాలియా ప్రధాని మొహమ్మద్ హుస్సేన్ రూబుల్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్టేడియంకు మరికొద్ది సేపట్లో ఆయన చేరుకుంటారనగా ఈ దాడి జరిగింది.
ఇదీ చదవండి : అఫ్గానిస్థాన్లో పేలుడు- 15 మంది మృతి