సనత్‌నగర్ నియోజక వర్గంలో రాంగోపాల్‌పేట్ డివిజన్ కార్పోరేటర్ అరుణా శ్రీనివాస్ గౌడ్.. వాడవాడల్లో ప్రచారం చేస్తున్నారు. స్థానిక బస్తీవాసులు, నేతలు బ్రహ్మరథం పడుతున్నారు. డివిజన్‌లోని అశ్రుఖాన్ గల్లీ, కటిక బస్తీ, కళాసిగూడ, టోబోకో బజార్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. ఇంటింటా తిరుగుతూ తెరాస చేసిన అభివృద్ధిని తెలియజేశారు. తెరాస గెలుపు వల్ల మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తెరాసకు మరో మారు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏదో చేద్దామని డిల్లీ నుంచి వస్తున్న బిజేపీ జాతీయ నాయకులు హైద్రాబాద్‌కు ఏం చేశారని అరుణ శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. డివిజన్ ఇంచార్జీ, వరంగల్ ఎంపీ దయాకర్ డివిజన్‌లో భారీ మోజారిటీతో గెలిపించేందుకు సిద్దంగా ఉన్నామని, హైదరాబాద్ మేయర్ పదవికి అరుణ శ్రీనివాస్ గౌడ్ కూడా బరిలో ఉన్నారని, అందుకు తగిన ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
బంపర్ మెజారిటీతో గెలిచి కేసీఆర్‌కు కానుక ఇస్తా : అరుణ గౌడ్ - గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు 2020
రాంగోపాల్ పేట్ డివిజన్‌లో తెరాస అభ్యర్థి అరుణ శ్రీనివాస్ గౌడ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 150 డివిజన్లలోనే ఇక్కడ అత్యధిక మెజారిటీతో గెలుపొంది కేసీఆర్‌కు గెలుపును కానుకగా ఇస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం సందర్భంగా అరుణ గౌడ్ మేయర్ అభ్యర్థిగానూ బరిలో ఉన్నారని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు.