గత పాలకులు సమస్యలు తీర్చక పోవడంతో డివిజన్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామచంద్రపురం భాజపా అభ్యర్థి నర్సింహ గౌడ్ తెలిపారు. నగర శివారులోని సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. తాజాగా వరదల సమయంలో ప్రతి ఇంటికి వరద నీరు వచ్చి ఇబ్బందుల పాలయ్యారని, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే ప్రజా సమస్యలను దూరం చేసి.. నిధులు తెచ్చి డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. రామచంద్రాపురం డివిజన్ వాసులు కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. గెలిపిస్తే డివిజన్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరిస్తానని, నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని నర్సింహ గౌడ్ తెలిపారు.
మార్పు కోరుకుంటున్నారు : భాజపా అభ్యర్థి నర్సింహగౌడ్ - తెలంగాణ రాజకీయాలు
నగరంలో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని, తెరాస పాలకులు చేసిందేమీ లేదని రామచంద్రాపురం భాజపా అభ్యర్థి నర్సింహ గౌడ్ ఆరోపించారు. ప్రచారంలో ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని, మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టం చేస్తున్నారని ఆయన తెలిపారు.