ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా ఓటరు గుర్తింపు కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 150 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. డివిజన్‌కు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రాలను ఇందుకోసం ఎంచుకున్నారు. మొబైల్ యాప్ ద్వారా ఓటరు గుర్తింపు ప్రక్రియను ఆయా పోలింగ్ కేంద్రాల్లో చేపడతారు. యాప్ సహాయంతో ఓటరును ఫోటో తీయడం ద్వారా అది నేరుగా సర్వర్‌కు వెళ్తుంది. సర్వర్‌కు అనుసంధానించిన ఓటరు జాబితాలోని ఫోటోలతో ఆ ఫోటోను పరిశీలించి ఓటరును ధృవీకరిస్తుంది.
పురపాలక ఎన్నికల సమయంలో కొంపల్లిలోని పది కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయగా 82శాతం కచ్చితత్వం వచ్చింది. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఇంటర్నెట్ సౌకర్యం బాగా ఉండే, వెలుతురు బాగా ఉండే పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో అదనంగా ఒక్కో విద్యార్థి వాలంటీర్‌ను నియమిస్తారు. మొబైల్ ఫోన్లు, సిమ్‌లను సమకూర్చి వాటి ద్వారా ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ సహాయంతో ఓటరు గుర్తింపు ప్రక్రియను చేపడతారు. ఇందుకోసం ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
150.. 4జీ సిమ్‌లతో పాటు వెబ్‌కాస్టింగ్ రిజర్వ్ జాబితా నుంచి విద్యార్థి వాలంటీర్లను ఒక్కొక్కరిని అదనంగా ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సాధారణ పరిశీలకుల సమక్షంలో అదనపు విద్యావాలంటీర్ల ఎంపిక జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
సంబంధిత కథనాలు: 150 పోలింగ్ కేంద్రాల్లో ఫేసియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ