ETV Bharat / ghmc-2020

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటేసేందుకు.. రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 7 గంటల నుంచే పోలింగ్‌ స్టేషన్లకు వచ్చిన వీరంతా.. తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత ముఖ్యమైందని.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచించారు.

Etv - Bharat
జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసిన సినీ, రాజకీయ ప్రముఖులు
author img

By

Published : Dec 1, 2020, 6:34 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునేందుకు.. ప్రముఖులు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ స్టేషన్లకు 7 గంటల నుంచే చేరుకున్నారు. పురపాలక శాఖ మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ డివిజన్ నందినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. సతీసమేతంగా తరలివచ్చి ఓటు వేశారు. కాచిగూడలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఓటు వేశారు. దీక్షా మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో.. సతీమణి కావ్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంబర్ పేట్ లో మురళీధర్ రావు.. కుటుంబ సమేతంగా వచ్చి ఓటేశారు. నాచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు.. ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రీపురంలో ఓటేశారు. ద్విచక్రవాహనంపై పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓవైసీ... ఓటు హక్కు వినియోగించుకున్నారు.

భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిపూర్ణం

ప్రజల భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుందని.. ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఆమె.. ప్రజలందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మలక్​పేట సర్కిల్ అజంపురా డివిజన్​లో.. హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కుటుంబసమేతంగా వచ్చి ఓటేశారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్​పల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .. చర్లపల్లి డివిజన్ కాప్రాలో నగర మేయర్ బొంతు రామ్మోహన్‌ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-14లోని నందినగర్ లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓటు వేశారు. కూకట్​పల్లిలోని శేషాద్రినగర్​లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శేరిలింగంపల్లిలోని వివేకానందనగర్ క్లబ్ హౌస్​లో శాసనసభ్యులు అరికెపుడి గాంధీ... ఉప్పల్​లో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి... సతీమణి స్వప్నతో కలిసి ఓటు వేశారు. అటు ముషీరాబాద్​లోని కార్మిక భవన్​లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​లో ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఓటేశారు. సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి బంజారాహిల్స్ యూరో కిడ్స్ స్కూల్​లో.. ఓటేశారు.

ఓటు వేసిన ప్రజాగాయకుడు గద్దర్

అల్వాల్ వెంకటాపురంలోని మహాబోధి స్కూల్లో ప్రజాగాయకుడు గద్దర్ .. తార్నాకలో మాజీ మేయర్ బండకార్తీక, భాజపా ఎమ్మెల్సీ రామచంద్రారావు, గోల్నాకలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఓటింగ్​లో పాల్గొన్నారు. అల్వాల్ 134 డివిజన్​లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుటుంబ సమేతంగా వచ్చి ఓటు వేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్​లోని రామచంద్రాపురంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమయత్​నగర్ ఉర్దూ గల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో.. సీపీఐ జాతీయ నేత నారాయణ.. కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తరలొచ్చిన తారాలోకం

గ్రేటర్ ఎన్నికల్లో తెలుగు సినీనటీనటులు ముందు వరుసలో ఉన్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ లో ఉదయం 8 గంటల్లోపే మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటి పోలింగ్ కేంద్రంలో నటుడు నాగార్జున కూడా సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఫిల్మ్​నగర్​లోని జూబ్లీ పబ్లిక్ స్కూల్​లో ఓటు వేశారు. తల్లిదండ్రులు, సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన విజయ్... పోలింగ్ సిబ్బంది సూచనలు పాటిస్తూ తన ఓటును బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తం చేశారు.

కరోనా నుంచి కోలుకుని ఓటు వేసిన రాజశేఖర్​

అటు ఫిల్మ్​నగర్ క్లబ్​లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో నిర్మాతలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, అశ్వినీదత్ , దర్శకుడు బి.గోపాల్, నటి మంచులక్ష్మి, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఎస్​ఎన్​ఎల్ పోలింగ్ కేంద్రంలో దర్శకుడు తేజ, నిర్మాత లగడపాటి శ్రీధర్ ఓటు వేశారు. ప్రశాసన్​నగర్​లో కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్, షేక్​పేటలో రామ్ పోతినేని ఓటు హక్కు వినియోగించుకున్నారు. కూకట్​పల్లిలో కుటుంబ సమేతంగా నటకిరిటి రాజేంద్ర ప్రసాద్ ఓటేశారు. కరోనా బారిన పడి ఇటీవలె కోలుకున్న నటుడు రాజశేఖర్.. ఆయన సతీమణితో కలిసి జూబ్లీహిల్స్ లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.

ఓటు వేసిన పోలీస్​ బాస్​లు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉప్పర్ పల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కుందన్​బాగ్​లో డీజీపీ మహేందర్‌రెడ్డి...కుటుంబ సమేతంగా వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్ కేంద్రంలో ఏసీబీ డీఐజీ సుమతి కూడా ఓటేశారు. నాంపల్లి వ్యాయామశాల హైస్కూల్​లో సైబరాబాద్ సీపీ సజ్జనార్.. కుందన్​బాగ్ చిన్మయి స్కూల్​లో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఓటేశారు. అంబర్ పేట ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తమ ఓటు హక్కును వినియోగించున్నారు.

ఇదీ చదవండి: గ్రేటర్‌ ఎన్నికల్లో స్ఫూర్తిని చాటిన వృద్ధులు, వికలాంగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.