అల్వాల్ డివిజన్లో గత ఐదు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమకు మద్దతు పలకాలని అల్వాల్ డివిజన్ తెరాస అభ్యర్థి విజయశాంతి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్లోని పలు కాలనీల్లో తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. డివిజన్లో సమస్యలను తీరుస్తూ నిత్యం ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఇతర పార్టీలతో తనకు ఎలాంటి పోటీ లేదని, తన విజయం ఖాయమని అన్నారు. సాయమందని వరద బాధితులకు గెలిచిన వెంటనే సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా తెరాసకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి గ్రేటర్ పీఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
అల్వాల్లో నాకు పోటీ లేదు : విజయశాంతి రెడ్డి - తెలంగాణ రాజకీయాలు
అల్వాల్ డివిజన్లో తనకు పోటీ లేదని తెరాస అభ్యర్థి, సిట్టింగ్ కార్పొరేటర్ చింతల విజయశాంతి రెడ్డి అన్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గెలిస్తే అల్వాల్ చెరువు శుద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.