ETV Bharat / entertainment

'అందుకే వాళ్లు జబర్దస్త్​కు దూరం'... ఒంటరినైపోయా అంటూ రాంప్రసాద్​ కన్నీరు - ఇంద్రజ

రకరకాల స్కిట్​లతో కడుపుబ్బా నవ్వించే కామెడీ షో ఎక్స్​ట్రా జబర్దస్త్​. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రామ్​కు సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్​ అయింది. అయితే ఈసారి కామెడీ మాత్రమే కాకుండా భావోద్వేగానికి గురిచేసి కన్నీళ్లు పెట్టించింది జబర్దస్త్​ టీమ్. ఇంతకీ ఏమైంది?

d
d
author img

By

Published : Jun 5, 2022, 4:32 PM IST

ఎక్స్​ట్రా జబర్దస్త్​ అంటేనే కడుపుబ్బా నవ్వించే షో. అలాంటి షో ప్రేక్షకులకు కన్నీళ్లు పెట్టిస్తుందని ఊహించగలరా? కానీ కొత్త ప్రోమోలో చేసిన స్కిట్​తో భావోద్వేగానికి గురిచేసింది జబర్దస్త్​ టీమ్. రాకింగ్ రాకేశ్​ బృందం చేసిన ఓ స్కిట్​ ఇందుకు కారణం. సుడిగాలి సుధీర్​, ఆటో రాంప్రసాద్​, గెటప్​ శ్రీను స్నేహాన్ని చాటిచెబుతూ సాగిందీ స్కిట్. 2013లో మొదలై హిట్​ కాంబోగా నిలిచిన ఈ టీమ్​ జబర్దస్త్​లో చేసిన ప్రయాణాన్ని రాకింగ్​ రాకేశ్​, కెవ్వు కార్తీక్, నూకరాజు కళ్లకు కట్టినట్లు చూపించి జడ్జిలు, జబర్దస్త్​ టీమ్స్​కు కంటతడి పెట్టించారు.

జబర్దస్త్​కు గెటప్​శ్రీను, సుడిగాలి సుధీర్​ ఎందుకు దూరమయ్యారనే కారణం చెబుతూ రాకేశ్​ అండ్​ టీమ్​ అదరగొట్టేసింది. రాకేశ్​ ఆటో రాంప్రసాద్​గా, కెవ్వు కార్తీక్​ సుడిగాలి సుధీర్​గా, నూకరాజు గెటప్ ​శ్రీనుగా అలరించారు. ఈ స్కిట్​ చూసిన రాంప్రసాద్​ భావోద్వేగానికి గురవగా.. ఇంద్రజ కన్నీటి పర్యంతం అయ్యారు. మరోవైపు ఎప్పటిలాగే రాకెట్​ రాఘవ కుమారుడు మురారి తనదైన స్టైల్​లో నవ్వులు పూయించాడు. బుల్లెట్​ భాస్కర్​ చేసిన స్కిట్​ కూడా ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : 'ఎఫ్​ 3' @ 100కోట్లు.. 'ఎఫ్​ 4' స్క్రిప్ట్​ వర్క్​ షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.