ETV Bharat / entertainment

అసలు ఆ షో ఉందనే తెలియదు.. కట్​ చేస్తే స్టార్​.. బ్లాక్​మెయిల్​ చేసి మరీ - ఫైమా జబర్దస్త్

తెలంగాణ యాస, కామెడీ టైమింగ్​తో బుల్లితెరపై 'పటాస్​'లు పేల్చింది ఫైమా. 'జబర్దస్త్​'గా నవ్వులు పూయించి ఆడియన్స్​కు మరింత చేరవైంది. ఇలా ఎనర్జిటిక్​గా ఉంటూ ప్రతీస్కిట్​ను పండిస్తున్న ఫైమాకు అసలు మొదటి అవకాశం ఎలా వచ్చిందో తెలుసా? ఇందుకోసం ఓ దశలో తల్లిదండ్రులను బ్లాక్​మెయిల్​ చేసిందట.

ఫైమా
ఫైమా
author img

By

Published : Jun 11, 2022, 7:25 PM IST

ఫైమా

కడుపుబ్బా నవ్విస్తూ అలరిస్తున్న ఫైమాకు తక్కువ టైంలోనే బుల్లితెర ప్రేక్షకులు కనెక్ట్​ అయ్యారు. ఆమె హావభావాలు, పంచ్​లకు ఫిదా అయ్యారు. ఎక్స్​ట్రా జబర్దస్త్​తో బాగా పాపులర్​ అయిన ఫైమాకు పటాస్​ షో మంచి లాంచ్​ప్యాడ్​గా పనిచేసింది. పటాస్​తో బుల్లితెరలో కెరీర్​ మొదలు పెట్టిన ఫైమాకు అసలు ముందు ఆ పేరతో ఒక షో ఉందనే తెలియదట. మరి తొలి అవకాశం ఎలా వచ్చిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

"నేను కాలేజీ చదువుతున్న టైంలో పటాస్​ అని ఓ షో ఉన్నట్లు కూడా నాకు తెలీదు. అప్పటికి మా ఇంట్లో టీవీ లేదు. ఓ రోజు మా కాలేజీ ప్రిన్సిపాల్​​.. మీకు ఎంటర్​టైన్మెంట్​ లేదు కదా.. అందుకే ఓ కామెడీ షోకి తీసుకెళ్తాను అక్కడ మనం చూసి వచ్చేదాం అని అన్నారు. అలా పటాస్​లోకి ఎంట్రీ ఇచ్చి క్లిక్​ అయ్యాను. షోలో ఒక రౌండ్లో నేను మాట్లాడిన విధానం.. తెలంగాణ యాస అన్నీ నచ్చి నన్ను తీసుకున్నారు. డైరెక్టర్​ చేస్తావా అని అడిగితే సరే అన్నాను. ఇంట్లోవాళ్లను అడిగితే ఒప్పుకోలేదు. దాదాపు 20 రోజులు అయినా నేను మొండిపట్టు వీడలేదు. చచ్చిపోతా అంటూ వాళ్లని బ్లాక్​మెయిల్​ చేసి ఒప్పించాను."

-ఫైమా

చాలా హ్యాపీ: ఎక్స్​ట్రా జబర్దస్త్​, పటాసు షోలు తెచ్చిన ఫేమ్​తో తాను కూడా సెలబ్రిటీ అయిపోయానని సంబరపడుతోంది ఫైమా. ఒకప్పుడు తాను సెలబ్రిటీలను చూడాలని ఎలా ఎగబడేదాన్నో.. ఇప్పుడు అలా తనను చూడాలని, ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపుతున్నారని చెప్తూ ఖుషీ అవుతోంది. అది చాలా అదృష్టంగా భావిస్తున్నానని అంటోంది.

'మా ఊర్లో అయితే మా అమ్మానాన్నలకు మంచి పేరు వచ్చింది. మా ఇంటి అడ్రసే అందుకు ఉదాహరణ. ఒక్కప్పుడు ఫైమా ఇల్లు అంటే ఎవరికీ తెలిసేది కాదు మా నాన్న పేరు చెప్తేనే గుర్తుపట్టేవారు. అలాంటిది ఇప్పుడు నా పేరు చెప్తే ఇల్లు ఎక్కడో ఇట్టే చెప్పేస్తున్నారు. ఇందుకు మా నాన్న కూడా సంతోషంగా ఉన్నారు. మా నాన్న ఖతర్​లో ఉంటారు. అక్కడ కూడా మీ అమ్మాయి బాగా చేసిందంటూ ఆయనతో చెప్పుకుని ఫొటోలు దిగుతారట.' అని ఫైమా ఆనందం వ్యక్తం చేసింది. పటాస్​లో డైరెక్టర్​ సంతోష్​, ఎక్స్​ట్రా జబర్దస్త్​లో బుల్లెట్​ భాస్కర్​ల సహకారంతో రెండు చోట్లా సక్సెస్​ అయ్యాయని చెప్పుకొచ్చింది.

అన్నీ తనే: ఎంటర్​టైన్మెంట్​, గురువు, ఫ్రెండ్​.. ఇలా తనకు అన్నీ బుల్లెట్​ భాస్కరే అంటోంది ఫైమా. తాను డల్​గా ఉంటే నవ్విస్తాడని చెప్పుకొచ్చింది. మిగతా టీమ్​లీడర్స్​ కూడా తనకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తారని.. స్కిట్స్​కు సంబంధించి ఏదైనా అవసరం ఉంటే సాయం చేస్తారుని ఫైమా చెప్తోంది. 'మొదట అవినాశ్​ అన్న స్కిట్​లో చేశాను. కానీ ఆ తర్వాత రెండు స్కిట్లు చేశాక తను వెళ్లిపోయాడు. పటాస్​ కూడా అయిపోవచ్చింది. ఏం చేద్దాం అనుకున్న టైంలో జీవన్​ అన్న పిలిచాడు. కానీ అది అనుకున్నంత సక్సెస్​ అవ్వలేదు. బుల్లెట్​ భాస్కర్​ టీమ్​లోకి వచ్చాకే మంచి పేరు వచ్చింది.' అని అంటోంది ఫైమా.

ఇదీ చూడండి : 'కనిపించేంత సరదాగా ఉండను ఏడ్చేస్తా'.. బాడీ షేమింగ్​పై రోహిణి ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.