ETV Bharat / entertainment

డేంజర్​ జోన్​లో స్ట్రాంగ్​ కంటిస్టెంట్స్​ - ఆ ఇద్దరిలో బిగ్​బాస్​ హౌస్ వదిలేది ఎవరు? - బిగ్​బాస్

Bigg Boss 7 Telugu 13th Week Elimination : బిగ్​బాస్​లో ఈవారం ఓటింగ్ నిజంగానే ఉల్టా పల్టా అయిపోయింది. "ఫినాలే అస్త్ర" టాస్క్‌లో జరుగుతున్న పరిణామాలను బట్టి.. ఓటింగ్‌లో కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. రోజు రోజుకీ ఎలిమినేషన్ లెక్కలు మారిపోతున్నాయి. మరి ఈ వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నారో తెలుసా..?

Bigg Boss 7 Telugu 13th Week Elimination

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 5:00 PM IST

Updated : Dec 1, 2023, 5:20 PM IST

Bigg Boss 7 Telugu 13th Week Elimination: బిగ్​ బాస్​ హౌస్​లో గత 12 వారాల ఎలిమినేషన్స్ ఓ లెక్క.. ఈ 13 వారం ఎలిమినేషన్ మరో లెక్క అన్నట్టుగా మారింది ఓటింగ్ ట్రెండ్. తీగ లాగితే డొంక కదిలినట్టుగా.. ‘ఫినాలే అస్త్ర’ టాస్క్‌‌లో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఓటింగ్ ఉల్టా పల్టా అవుతున్నట్టుగా ప్రేక్షకులు అనుమానిస్తున్నారు. దీంతో.. ఇద్దరు స్ట్రాంగ్ కంటిస్టెంట్లలో ఒకరు ఇంటికి వెళ్లడం తప్పదా? అనే చర్చ సాగుతోంది.

ఈ వారం ఎవరు? : గత వారం డబుల్ ఎలిమినేషన్ పేరుతో అశ్విని, రతిక.. ఇలా ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వెళ్లిపోయారు. దీంతో హౌజ్​లో ఎనిమిది మిగిలారు. ఆదివారం ఎపిసోడ్​ పూర్తైన వెంటనే సోమవారం జరిగిన నామినేషన్స్​ ప్రక్రియలో 8 మందిలో అమర్​దీప్​ మినహా మిగిలిన ఏడుగురు నామినేట్​ అయ్యారు. వాళ్లు.. శివాజీ, ప్రశాంత్​, యావర్​, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్​ అండ్​ గౌతమ్​.

బిగ్​బాస్ బ్యూటీ "శోభా శెట్టి" లవర్ ఇతనా! "కార్తీక దీపం" సీరియల్‌ నుంచే ప్రేమాయణం!!

లాస్ట్‌లో ఆ స్ట్రాంగ్​ కంటెస్టెంట్స్​​: గతవారం ఇద్దరు ఫిమేల్​ కంటెస్టెంట్స్​ ఎలిమినేట్​ కాగా.. ఈ వారం మాత్రం కచ్చితంగా ఒక మేల్ కంటెస్టెంట్ వెళ్లిపోతాడని ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పటి వరకూ ఉన్న అన్-​అఫీషియల్స్​ ఓటింగ్ ప్రకారం.. ప్రశాంత్​ టాప్‌లో ఉన్నాడని సమాచారం. ఇక తర్వాత రెండు, మాడు స్థానాల్లో శివాజీ, యావర్​ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తర్వాత స్థానాల్లో.. శోభా, ప్రియాంక ఉండగా.. అర్జున్, గౌతమ్​ తక్కువ ఓట్లతో ఓటింగ్ లిస్ట్‌లో లాస్ట్‌లో ఉన్నారని సమాచారం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బిగ్​బాసూ ఇదేందయ్యా ఇదీ - విన్నర్​ ఆయన - ప్రైజ్​మనీ ఈయనకా? ఇదెేం లెక్క!

డేంజర్ జోన్‌లో గౌతమ్ : గౌతమ్.. బిగ్​బాస్ సీజన్ 7 ప్రారంభం నుంచి ఉండగా.. అర్జున్ మాత్రం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్​లోకి వచ్చాడు. ముందు నుంచి గౌతమ్ ఆట అంతంత మాత్రంగానే ఉన్నా.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చినప్పటి నుంచి తన స్ట్రాటజీలు మారిపోయాయి. టాస్కుల విషయంలో కూడా చాలా పట్టుదలతో ఆడడం మొదలుపెట్టాడు. ఎక్కువశాతం ఏ గ్రూప్స్ జోలికి వెళ్లకుండా ఒంటరిగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే హౌజ్​లో గౌతమ్​.. ఎక్కువగా శివాజీతోనే గొడవలు పెట్టుకుంటున్నాడు. దీంతో శివాజీ ఫ్యాన్స్ అంతా కలిసి ఓటింగ్ లెక్కలు మార్చి గౌతమ్‌ను ఎలిమినేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.

Bigg Boss Telugu 7 Wild Card Entries : బిగ్​బాస్​ వైల్డ్​ కార్డ్​.. ఎవరెవర్నో తెచ్చారు.. క్రేజ్ పెరిగేనా?

అదే అర్జున్‌కు మైనస్..: ఆట పరంగా చూస్తే అర్జున్​ టఫ్​ఫైట్​ ఇస్తున్నా.. ఓటింగ్ విషయంలో మాత్రం ఈ కంటెస్టెంట్ ఎప్పుడూ చివర్లోనే ఉంటున్నాడు. గతవారం కూడా ఓటింగ్ పరంగా అర్జున్ డేంజర్ జోన్‌లోనే ఉన్నాడు. లాస్ట్​ వీక్​ కెప్టెన్సీ సమయంలో కూడా అమర్‌దీప్ పట్ల అర్జున్ ప్రవర్తన సరిగా లేదని చాలామంది ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. దీంతో అర్జున్ హౌజ్‌లో ఉండడం కరెక్ట్ కాదు అనుకునేవారు కూడా ఉన్నారు. అలాగే కెప్టెన్సీ టాస్క్ సమయంలో శివాజీ.. అర్జున్​ సపోర్ట్ చేసినా కూడా అర్జున్.. శివాజీని ఎలిమినేషన్​కు నామినేట్ చేయడం అతనికి మైనస్‌గా మారింది. ఇక ఈవారం గౌతమ్, అర్జున్‌లలో ఎవరో ఒకరు బిగ్​బాస్ సీజన్ 7ను వదిలి వెళ్లిపోవడం పక్కా అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్​బాస్​ 7 గ్రాండ్​ ఫినాలేకు ముహూర్తం ఫిక్స్​ - ఆ రోజే ఎండ్​ కార్డ్​!

ఈ వారం నో ఎలిమినేషన్​? : ఎలిమినేషన్​ విషయంలో మరో వాదన కూడా తెరమీదకి వచ్చింది. ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని.. ఎవిక్షన్ పాస్​ను ఈ వారం వాడి.. ఎలిమినేషన్​ ఎత్తేసి.. నెక్ట్స్​వీక్​లో ఒకరిని ఇంటికి పంపించి.. ఫినాలేకి టాప్​ 7ని తీసుకెళ్లాలని బిగ్​బాస్​ నిర్వాహకులు ప్లాన్​ చేస్తున్నారనే చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఈ ఆదివారం ఏం జరగనుందో..!

Voice Behind Bigg Boss Season 7 Telugu: బిగ్​బాస్​ హౌస్​లో వినిపించే గొంతు ఎవరిదో కాదు.. ఇతనిదే..!

Last Updated : Dec 1, 2023, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.