Bigg Boss 7 11th Week Nominations: బిగ్బాస్ సీజన్ 7 దీపావళి స్పెషల్ ఎపిసోడ్ అంగరంగ వైభవంగా జరిగింది. కంటెస్టెంట్ల ఫ్రెండ్స్, ఫ్యామిలీ బిగ్బాస్ వేదికపైకి వచ్చి.. తమ వారితో మాట్లాడుకున్నారు. సలహాలు ఇచ్చారు. వచ్చినవారితో నాగార్జున బిగ్బాస్ సీజన్ 7 టాప్ 5 ఎవరంటూ గేమ్ ఆడించారు. ఇదిలా ఉంటే.. బిగ్బాస్ హౌజ్‌లో ఆదివారం ఫన్ అంతా.. సోమవారం ఫైర్‌గా మారుతుంది.
బిగ్‌బాస్‌లో 10వ వారం సింగర్ భోలే షావలి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. 11వ వారం నామినేషన్ ప్రక్రియ సోమవారం నాడు మొదలైంది. గత ఆరు సీజన్లతో పోల్చుకుంటే.. ఈ సీజన్లో నామినేషన్ ప్రాసెస్ రెండు రోజుల పాటు సాగుతోంది. దానికి కారణం.. హౌస్మేట్స్ మధ్య జరుగుతున్న వాదనలు. ఇక సోమవారం నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్ల మధ్య మాటల తూటాలు పేలాయి. 11 వారం ఇంటి నుంచి బయటకు పంపించాలనుకుంటున్నా ఇద్దరిని నామినేట్ చేసి.. వాళ్ల తలపై బాటిల్‌ని పగలకొట్టాలని చెప్పిన బిగ్బాస్.. ఈ ప్రక్రియను రతికతో మొదలుపెట్టమన్నాడు.
బిగ్బాస్ బ్యూటీ "శోభా శెట్టి" లవర్ ఇతనా! "కార్తీక దీపం" సీరియల్ నుంచే ప్రేమాయణం!!
నామినేషన్స్ మొదలైన కొద్దిసేపటికే.. రతిక-ప్రియాంక, శోభా మధ్య హాట్‌హాట్ డిస్కషన్ జరగ్గా.. రెండోవైపు అర్జున్-ప్రశాంత్ మధ్య సీరియస్ వార్ నడిచింది. అంతే కాకుండా ప్రియాంక-అశ్విని, రతిక మధ్య కూడా వాదోపవాదాలు సాగాయి. అయితే నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు(నవంబర్ 14) కూడా కొనసాగనుంది. దీనికి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు పూర్తిగా వివాదాల మధ్య సాగిన ఈ ప్రక్రియ రెండో రోజు మాత్రం కాస్త సరదాగా సాగింది.
అశ్విని, అర్జున్, అమర్‌లకు మధ్య సరదా సంభాషణలు కొనసాగాయి. 'మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి' అని అశ్విని అనడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. మరోవైపు రెండో రోజు కూడా అర్జున్, పల్లవి ప్రశాంత్ మధ్య గొడవ కొనసాగుతూనే ఉంది. ‘'నేనెవరో తెలియాలంటే వెళ్లి గూగుల్‌ను అడుగు'’ అని ప్రశాంత్ చెప్పడంతో అర్జున్‌కు కోపం వచ్చింది. ఇక యావర్‌పై అమర్ కూడా ఫైర్ అయ్యాడు. మొదటి వారాల్లో జరిగిన విషయాలను మనసులో పెట్టుకుని అతడు తనని నామినేట్ చేస్తున్నాడంటూ అమర్ అరిచాడు.
రామ్‌చరణ్ మూవీలో బిగ్బాస్ కంటెస్టెంట్ కీలక పాత్ర- అనౌన్స్ చేసిన డైరెక్టర్!
ఇదిలా ఉంటే.. మొదటి రోజు నామినేషన్స్‌లో అశ్విని తలపై ప్రియాంక బాటిల్ పగలగొట్టింది. అయితే.. రెండో రోజు ప్రియాంక తలపై కాకుండా.. బాటిల్‌ను అశ్విని తన చేతిపై పగలగొట్టుకుంది. మరి ఇలా చేయడానికి రీజన్ ఏం చెబుతుందో ఈరోజు ఎపిసోడ్లో చూడాలి. మొత్తంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యే సరికి మొత్తం 8 మంది నామినేషన్స్‌లోకి వచ్చినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వారు..
1. యావర్
2. అమర్ దీప్
3. అర్జున్
4. గౌతమ్
5. రతిక
6. ప్రియాంక
7. శోభా
8. అశ్విని
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పాము విషంతో రేవ్‌పార్టీ! బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్‌పై కేసు, 'అర్జెంట్‌గా అరెస్ట్ చేయాల్సిందే'
Bigg Boss Show : 3 రోజులు రూ.2 కోట్లు.. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ తెలుసా?
Voice Behind Bigg Boss Season 7 Telugu: బిగ్బాస్ హౌస్‌లో వినిపించే గొంతు ఎవరిదో కాదు.. ఇతనిదే..!