ETV Bharat / entertainment

NBK 108: శ్రీలీల బాలయ్య కూతురు కాదా?.. ఆమె కోసం అన్ని కోట్లా? - ఎన్​బీకే 108లో శ్రీలీల

నందమూరి బాలకృష్ణ అనిల్​ రావిపుడి కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్​బీకే108. ఈ సినిమాలో శ్రీలీలకు తండ్రిగా బాలయ్య కనిపిస్తారన్న వార్తలు నిజం కావట. ఇంతకీ ఈ చిత్రంలో వారిద్దరి మధ్య రిలేషన్ ఏంటో తెలుసా?

sreeleela
sreeleela
author img

By

Published : Apr 1, 2023, 5:45 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్​ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్​బీకే 108' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. మరోవైపు ఐపీఎల్​ తెలుగు కామెంటరీ కూడా చేయడం ప్రారంభించారు. అయితే ఎన్​బీకే 108 సినిమాలో హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​తో పాటు యువ కథానాయిక శ్రీలీల కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా అనౌన్స్​ చేసినప్పటి నుంచి శ్రీలీల.. బాలయ్యకు కూతురిగా నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఆ వార్తల్లో నిజం లేదట. అయితే వీరిద్దరి మధ్య రిలేషన్​ ఏంటంటే.. శ్రీలీలకు బాలయ్య బాబాయ్​గా కనిపించనున్నారట. శ్రీలీల తండ్రి పాత్రలో హీరో శరత్ కుమార్ నటిస్తున్నారట. అలా ఈ చిత్రంలో బాలయ్యకు అన్నయ్యగా, శ్రీలీలకు తండ్రిగా కనపడనున్నట్లు సమాచారం. దీంతో ఇక ఈ బాబయ్​ కూతురు రిలేషన్​ తెరపై చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఇటీవలే.. దర్శకుడు అనిల్ రావిపుడి ఓ ఏమోషనల్ సీక్వెన్స్​ను చిత్రీకరించారట. బాలయ్య-శ్రీలీలకు మధ్య ఈ ఎమోషనల్ సీన్​ను షూట్​ చేశారట. ఇది​ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని సమాచారం అందుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో ప్రతినాయకుని పాత్ర కోసం బాలీవుడ్​ నటుడు అర్జున్ రామ్‌పాల్‌ను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని విజయదశమికి రిలీజయ్యేందుకు సిద్ధమౌతోంది. రీసెంట్​గా ఈ మూవీకీ సంబంధించిన రెండు పోస్టర్లను కూడా విడుదల చేశారు మేకర్స్​. ఇందులో బాలయ్య పవర్​ఫుల్​ లుక్​లో కనిపించి ఆకట్టుకున్నారు. అవి నెట్టింట్లో బాగా ట్రెండ్ కూడా అయ్యాయి. అలానే అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

ఒక్క సాంగ్​కు అన్ని కోట్లా.. తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్​ కోసం ముంబయికి చెందిన వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు డ్యాన్సర్లను హైదరాబాద్​కు పిలిపించారని తెలిసింది. శ్రీలీల కూడా ఇందులో కనిపించనుందట. ఈ పాట ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. సుమారు ఐదు కోట్ల బడ్జెట్​తో తెరకెక్కుతున్న ఈ సాంగ్​కు తమన్ బాణీలు కడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది. ఒక్క సాంగ్​ కోసం ఇంత ఖర్చు పెడుతున్నారా అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో మరో హీరోయిన్ అంజలి కూడా నటించనుందని టాక్ వినిపిస్తోంది. విలన్ క్యారెక్టర్​లో కనిపించబోతున్నట్లు సమాచారం అందింది. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.