ETV Bharat / entertainment

సేమ్​ ఫార్ములాతో అఖిల్ 'ఏజెంట్​'.. మెషిన్ గ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తుందా? - అఖిల్ ఏజెంట్ ట్రైలర్​

అఖిల్ 'ఏజెంట్​' సినిమా రిలీజ్​కు రెడీ అయిపోయింది. ఏప్రిల్ 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా కూడా ఓ సెంటిమెంట్​ అండ్ హిట్​ ఫార్ములాను ఫాలో అయింది! ఆ వివరాలు..

Machine gun Agent
అఖిల్ 'ఏజెంట్​' సేమ్​ ఫార్ములా.. మెషీన్ గ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తుందా?
author img

By

Published : Apr 22, 2023, 6:04 PM IST

చిత్రసీమలో సెంటిమెంట్లు ఎక్కువన్న సంగతి తెలిసిందే. అలానే సినిమాల సక్సెస్ విషయంలో ఓ ఫార్ములా హిట్​ అయితే.. అదే ట్రెండ్​ను కొనసాగిస్తుంటారు దర్శకనిర్మాతలు. కానీ ఈ ట్రెండ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది.‌ అయితే ఇప్పుడు ఏజెంట్ సినిమా మూవీ టీమ్​ కూడా ఓ సెంటిమెంట్ అండ్​ హిట్​ ఫార్ములాను​ ఫాలో అయింది. దానిపై బాగా న‌మ్మ‌కం పెట్టుకున్నట్లు క‌నిపిస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రం అనౌన్స్​ చేసినప్పటి నుంచి కూడా పక్కా యాక్షన్​ థ్రిల్లర్​ సినిమాగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్​గా రిలీజైన ఈ చిత్ర ట్రైల‌ర్​లో హీరో అక్కినేని అఖిల్ ఆఖర్లో.. మెషీన్ గ‌న్ను ప‌ట్టుకుని విధ్వంసం సృష్టిస్తాడు. ఆ షాట్ మాస్ ప్రేక్ష‌కుల దృష్టిని బాగా ఆక‌ర్షించింది. క‌థ‌లో భాగంగానే అఖిల్ ఈ యాక్షన్ ఫీట్​ చేసినప్పటికీ.. ఆడియెన్స్ మాత్రం ఆ సీన్​ చూడగానే.. గత చిత్రాలను బాగా గుర్తుచేసుకుంటున్నారు.

అదేంటంటే.. గత కొంతకాలంగా హీరోలు.. తమ చిత్రాల్లో మెషీన్ గన్​తో విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాలు వ‌రుస‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్లు అవుతున్నాయి. ఇప్పుడది చిత్రసీమలో అదొక సెంటిమెంట్​గా, లేదంటే ఓ హిట్​ ఫార్ములా మారిపోయిందనే చెప్పాలి! గతంలో ఈ మెషిన్ గన్​తో యాక్షన్​ సీన్స్​ చాలా సినిమాల్లో ఉన్నప్పటికీ.. తమిళంలో కార్తి హీరోగా రూపొందిన ఖైదీలో ఉన్న మెషిన్ గన్​ సన్నివేశం అభిమానులకు గూస్ బంప్స్​ తెప్పించింది. ఈ చిత్రం చివ‌ర్లో కార్తి పోలీస్ స్టేష‌న్​ దగ్గర.. మెషీన్ గ‌న్​తో విల‌న్లపై విరుచుకుపడుతూ విధ్వంసం సృష్టిస్తాడు. ఆ సీన్​ సినిమాకే హైలైట్​గా నిలిచింది. ఆ త‌ర్వాత 'కేజీయఫ్​-2'లో రాకీ భాయ్​గా యశ్​ కూడా ఇంటర్వెల్​ సీన్​లో మెషీన్ గన్​తో పోలీస్​ స్టేషన్​, పోలీస్​ జీప్​లపై బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు. ఆ సన్నివేశం థియేటర్లలో దద్దిరిల్లిపోయింది. ఆ చిత్రం ఇండియావైడ్​గా మెగా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్​ అయింది. అనంతరం యూనివర్సల్​ స్టార్​ క‌మ‌ల్ హాస‌న్ 'విక్ర‌మ్' మూవీలో ఇలాంటి విన్యాస‌మే చేశారు. క్లైమాక్స్​లో పాత కాలం నాటి నాటు మెషీన్ గ‌న్​ను వినియోగిస్తూ రౌడీషీటర్లపై బులెట్లతో విరుచుకుపడతారు. ఆ మూవీ కూడా అదిరిపోయే సక్సెస్​ను అందుకుంది. ఇక రీసెంట్​గా వాల్తేరు వీర‌య్య‌లో చిరంజీవి కూడా.. విలన్లపై ఇదే బడా గన్​తో విరుచుకుపడతారు. ఈ చిత్రం కూడా సూపర్​హిట్​గా నిలిచింది. ఇప్పుడు అఖిల్ కూడా మెషీన్ గ‌న్​ ప‌ట్టుకుని.. బాక్సాఫీస్​పై విధ్వంసానికి దిగుతున్నాడు. మరి బాక్సాఫీస్​ షేక్​ అవుతుందో లేదో చూడాలి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'బుజ్జి కన్న' ఇవానా పాప టాలీవుడ్​కు వచ్చేస్తుందోచ్​.. ఏ సినిమాతో అంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.