ETV Bharat / entertainment

తేడా వస్తే నవ్వుతా నరాలు తీస్తాం.. విశ్వక్​ సేన్ పవర్​ఫుల్ వార్నింగ్​ ఎవరికో? - లారెన్స్​ చంద్రముఖి 2 అప్డేట్స్

vishwak sen vs11 : కాంట్రవర్సీ హీరో విశ్వక్‌ సేన్‌.. తేడా వస్తే నవ్వుతా నరాలు తీస్తాం.. అంటూ పవర్​ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ఏం జరిగిందంటే.

vishwak sen vs11
తేడా వస్తే నవ్వుతా నరాలు తీస్తాం.. విశ్వక్​ సేన్ పవర్​ఫుల్ వార్నింగ్​ ఎవరికో?
author img

By

Published : Jul 31, 2023, 10:57 AM IST

Updated : Jul 31, 2023, 11:39 AM IST

vishwak sen vs11 title glimpse : దినేశ్‌ నాయుడు అంటే చాలా మందికి తెలీదు కానీ కానీ విశ్వక్‌ సేన్‌ అంటే టక్కున గుర్తుపడతారు. యూత్‌ఫుల్‌, లవ్‌, కమర్షియల్‌ చిత్రాలతో మాస్‌ కా దాస్‌గా ప్రేక్షకులకు చేరువైన ఆయన.. ఈ మధ్యనే దాస్ కా దమ్కీ చిత్రంతో ఆడియెన్స్​ను పలకరించారు. ఇప్పుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌ కూడా బాగా ఆకట్టుకుంది. అందులో విశ్వక్​.. ఎన్టీఆర్‌ పెయింటింగ్‌ వేసి ఉన్న గోడ ముందు మాస్‌ లుక్‌తో నుంచోని కనిపించారు.

తాజాగా మూవీటీమ్ సినిమా టైటిల్​ పోస్టర్ అండ్ గ్లింప్స్​ను రిలీజ్ చేసింది. ఇందులో విశ్వక్​సేన్​ గోదావరి బ్రిడ్జి కింది నదిలో పడవ వేసుకుని వెళ్తూ కనిపించారు. ఓ నలుగురుని వెంట వేసుకుని కత్తులు పట్టుకుని.. మాస్​ లుక్​లో ఉన్నారు. సినిమాకు 'గ్యాంగ్స్​ ఆఫ్​ గోదావరి' అనే టైటిల్​ను ఖరారు చేశారు. ఇక గ్లింప్స్​ కూడా ఎంతో పవర్​ ఫుల్​గా చూపించారు. 'అన్నాయ్​ మేం గోదారోళ్లాం. మాటోటే సాగదీస్తాం. తేడా వస్తే నవ్వూతూ నరాలు లాగేస్తాం' అంటూ పవర్​ఫుల్​ వార్నింగ్​ ఇస్తూ కనిపించారు విశ్వక్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Srikanth Nayattu remake పవర్​ఫుల్​గా మోషన్ పోస్టర్​.. సీనియర్ నటుడు శ్రీకాంత్‌.. ప్రస్తుతం విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా కెరీర్​లో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడాయన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ బ్యానర్​పై హీరోగా మలయాళ సూపర్​ హిట్​​ 'నయట్టు' రీమేక్‌ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి 'కోట బొమ్మాళి' అనే టైటిల్‌ను ఖరారు చేసింది మూవీటీమ్​. ఓ మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేస్తూ స్పెషల్​ వీడియోను రిలీజ్ చేసింది. 'పరారీలో ఉన్న కోట బొమ్మాళి పోలీసులు' అంటూ ప్రారంభమైన ఈ ప్రచార చిత్రం ఆసక్తిరేపుతోంది. తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Lawrence Chandramukhi 2 new poster : సినీప్రియుల్ని భయపెట్టి.. ఫుల్​ థ్రిల్​కు గురి చేసిన సినిమా 'చంద్రముఖి'. పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హిట్‌ చిత్రానికి ఇప్పుడు 'చంద్రముఖి 2' వస్తోంది. ఫస్ట్ పార్ట్​లో రజనీకాంత్‌ హీరోగా నటించగా.. సీక్వెల్‌లో రాఘవ లారెన్స్‌ హీరోగా కనిపించనున్నారు. కంగనా రనౌత్‌ నర్తకిగా మరో ప్రధాన పాత్ర పోషించింది. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్​పై సుభాస్కరన్‌ నిర్మించారు.సినిమా వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్​ను రిలీజ్ చేశారు. ఇందులో లారెన్స్ రాజు లుక్​లో నడుస్తూ కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన వేషధారణ, నడిచే స్టైల్​ అన్నీ బాగున్నాయి. ఇకపోతే ఈ చిత్రంపి.వాసుకు 65వ సినిమా. కీరవాణి సంగీతం అందించారు. ఆర్‌.డి.రాజశేఖర్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

  • Back with double the swag and attitude! 😉 Witness Vettaiyan Raja's 👑 intimidating presence in @offl_Lawrence 's powerful first look from Chandramukhi-2 🗝️

    Releasing this GANESH CHATURTHI in Tamil, Hindi, Telugu, Malayalam & Kannada! 🤗#Chandramukhi2 🗝️
    🎬 #PVasu
    🌟… pic.twitter.com/nf7BHwi3x6

    — Lyca Productions (@LycaProductions) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి :

Baby move chiranjeevi : 'అది చూసి ఆశ్చర్యపోయా.. నా వల్ల కాలేక మూడు రోజులు బయటకు రాలేకపోయా'

TFCC Elections 2023 : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా 'దిల్'​రాజు.. కల్యాణ్​పై విజయం

Last Updated : Jul 31, 2023, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.