ETV Bharat / entertainment

'ఆంధ్రప్రదేశ్‌ అబ్బాయిల్లాంటి అమాయకమైన కుర్రాళ్లు దొరకరమ్మా..' 'మట్టి కుస్తీ' ట్రైలర్​ విడుదల - మట్టి కుస్తీ సినిమా రిలీజ్​ తేది

మాస్​ మహరాజ్​ రవితేజ, విష్ణు విశాల్‌ నిర్మిస్తున్న చిత్రం 'మట్టి కుస్తీ'. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

matti kusthi trailer released
matti kusthi trailer released
author img

By

Published : Nov 20, 2022, 9:20 PM IST

విష్ణు విశాల్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'మట్టి కుస్తీ'. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రవితేజ ఆర్​టీ టీమ్​ వర్క్స్​తో కలిసి విష్ణు విశాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే.. 'ఇంకోసారి పిల్లను చూడమని నన్ను అడక్కు. మన అల్లుడికి పెళ్లయిందా రత్నం. ఈ జన్మలో అవ్వదు.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.

గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథతో పాటు కామెడీ ఎంటర్‌టైనర్‌ను తలపించేలా ఉంది. హీరో ఈ సినిమాలో రెజ్లర్‌గా కనిపించనున్నారు. కేరళ అమ్మాయితో ఆంధ్ర అబ్బాయి మధ్య ప్రేమకథ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబరు 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని సినీ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకు జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాకు జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతమందిస్తున్నారు. రిచర్డ్​ ఎమ్​ నాథన్ సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరిస్తున్నారు.

ఇవీ చదవండి : 'సలార్‌'పై స్టార్‌ హీరో భార్య ఆసక్తికర కామెంట్స్.. ఏమందంటే!

'వాల్తేరు వీరయ్య' క్రేజీ అప్డేట్​.. 'బాస్​ పార్టీ'కి గెట్ రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.