ETV Bharat / entertainment

'ఆ పాత్ర కోసం సాయి పల్లవి ఆహారం తీసుకోలేదు' - రానా

Sai Pallavi: ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయి.. తన నటనా చాతుర్యంతో మైమరిపిస్తుంది సాయి పల్లవి. పాత్ర కోసం ఆమె ఎంతో శ్రమిస్తుంది. ఈ క్రమంలోనే రానాతో కలిసి నటించిన 'విరాటపర్వం' సినిమా కోసం ఆమె ఆహారం తీసుకోకుండా ఉందని చెప్పారు దర్శకుడు వేణు ఊడుగుల.

virata parvam
Sai Pallavi
author img

By

Published : May 29, 2022, 8:08 PM IST

Sai Pallavi: 'నీది నాది ఒకే కథ' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టి ఆకర్షించిన దర్శకుడు వేణు ఊడుగుల. 'వాస్తవ ఘటనలే నా కథా వస్తువులు' అని చెప్తుండే ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం 'విరాటపర్వం'. రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా వేణు ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. సినిమా గురించి, నాయకానాయికల గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. వాటిల్లోని కొన్ని సంగతులివీ..

virata parvam
'విరాటపర్వం'
  • విరాటపర్వం ఎలా ఉండబోతుంది?

వేణు: 90ల నాటి కథ ఇది. గాఢమైన ప్రేమ, రాజకీయ నేపథ్యంలో సాగుతుంది. మనకు బాగా కావాల్సిన వారు చనిపోతే ఎలాంటి బాధ ఉంటుందో ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు అదే భావోద్వేగానికి లోనవుతారు. ఈ సినిమాలోని ఎమోషన్‌ అందరికీ కనెక్ట్‌ అవుతుంది.

virata parvam
వేణు ఊడుగుల
  • ఈ సినిమాలో నక్సలిజాన్ని చూపించినట్టున్నారు? మీ తొలి చిత్రంలోనూ సామాజికాంశాలను ప్రస్తావించారు?

వేణు: అలాంటి సమాజంలోనే నేను పుట్టి, పెరిగా. మాది వరంగల్‌. అక్కడి సమస్యలు, విప్లవాలు నాకో భిన్నమైన దారిని చూపాయి. దీంతోపాటు నేను చదివిన పుస్తకాలు, కలిసిన వ్యక్తుల ప్రభావమూ సినిమాపై పడుండొచ్చు.

virata parvam
సన్నివేశాన్ని వివరిస్తున్న వేణు
  • ఈ సినిమా కోసం నక్సలైట్ల గురించి రీసెర్చ్‌ చేశారా?

వేణు: లేదు. ఇంతకు ముందు చెప్పినట్టు, నక్సల్స్‌ జీవితాలు ఎలా ఉంటాయో బాల్యం నుంచే నాకు అనుభవం ఉంది. మా ఇంట్లో నుంచి చూస్తుంటే నక్సల్స్‌, పోలీసుల ఎన్‌కౌంటర్లు కనిపిస్తుండేవి. వాటికి నేను పత్యక్ష సాక్షిని. అందుకే ఈ కథ కోసం ఎలాంటి రీసెర్చ్‌ చేయలేదు.

virata parvam
రానా
  • ఎవరిని దృష్టిలో పెట్టుకుని రానా పాత్రను సృష్టించారు?

వేణు: నిజామాబాద్‌కు చెందిన శంకరన్న అనే వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకుని రానా పాత్రను రాశా. పాత్ర పేరు 'రవన్న' అని పెట్టా.

  • ఈ క్యారెక్టర్‌కు రానానే తీసుకోవడానికి కారణమేంటి? ఇంకా ఎవరినైనా సంప్రదించారా?

వేణు: ఈ పాత్ర కోసం ముందుగా రానానే కలిశా. మరెవరికీ ఈ స్క్రిప్టు వినిపించలేదు. సామాజిక స్పృహ, వాస్తవికతను తెరపైకి తీసుకురావాలనే ఆకాంక్ష.. తదితర లక్షణాలున్న నటుడు రానా. ఇలాంటి పవర్‌ఫుల్‌ పాత్రకు ఆయన న్యాయం చేయగలరనే నమ్మకం ముందు నుంచీ ఉంది. నేను అనుకున్నదాని కంటే మంచి ఔట్‌పుట్‌ ఇచ్చారాయన.

virata parvam
'వెన్నెల' పాత్రలో సాయి పల్లవి
  • సాయిపల్లవి గురించి..

వేణు: లుక్స్‌, నటన పరంగా పాత్రలో ఒదిగిపోయింది. ఆమె అసాధారణ నటి. అంకిత భావంతో పనిచేస్తుంది. పాత్రకు తగ్గ అవతారంలోకి మారేందుకు ఓ రోజు ఆహారం కూడా తీసుకోలేదామె. ఈ చిత్రంలో ఆమె వెన్నెల అనే క్యారెక్టర్‌లో కనిపిస్తుంది.

virata parvam
'విరాటపర్వం'లో సాయి పల్లవి, రానా
  • ఈ సినిమా ఇతర భాషల్లోనూ విడుదల చేయాలనుకుంటున్నారా?

వేణు: ప్రస్తుతానికి తెలుగు, మలయాళం, తమిళంలోనే విడుదల చేయాలనుకుంటున్నాం. హిందీ గురించి ఇంకా ఆలోచించలేదు.

  • మీపై ఏ దర్శకుడి ప్రభావం ఉంటుంది?

వేణు: ప్రభావం అనికాదు గానీ కె. బాలచందర్‌ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడతా.

virata parvam
దర్శకుడితో సాయి పల్లవి
  • తదుపరి చిత్రాలేంటి?

వేణు: ఇప్పటికైతే ఏం ఖరారు కాలేదు. పెద్ద హీరోల నుంచి 'ఓకే' అనే మాట వినిపిస్తే నిర్మాణ సంస్థలే వాటిని ప్రకటిస్తాయి.

ఇదీ చూడండి: త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న నేచురల్​ బ్యూటీ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.