ETV Bharat / entertainment

'అక్డీ పక్డీ' సాంగ్​ కొరియోగ్రఫీ సమయంలో ఏడ్చేశాను: విజయ్‌ దేవరకొండ - vijay devarakonda cried

విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లైగర్‌' సినిమాలోని 'అక్డీ పక్డీ' పాట దుమ్ము లేపుతోంది. విజయ్​, అనన్య స్టెప్పులకు ఫ్యాన్స్​ ఫిదా అయిపోతున్నారు. అయితే సాంగ్​ కొరియోగ్రఫీ సమయంలో తాను ఏడ్చేసినట్లు చెప్పుకొచ్చాడు విజయ్​.

Vijaydevarkonda Liger mass song released
'అక్డీ పక్డీ' సాంగ్​ కొరియోగ్రఫీ సమయంలో ఏడ్చేశాను: విజయ్‌ దేవరకొండ
author img

By

Published : Jul 12, 2022, 7:15 PM IST

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'లైగర్'. అనన్య పాండే కథానాయిక. కరణ్ జోహార్, చార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఈ సినిమాలోని 'అక్డీ పక్డీ' సాంగ్​ ఒక ఊపు ఊపేస్తుంది. పాటలోని మాస్​ బీట్​కు.. విజయ్‌ ఆట అదిరింది.

అయితే 'అక్డీ పక్డీ' పాటకు డ్యాన్స్​ చేసేటప్పుడు జరిగిన ఓ ఆసక్తిక విషయాన్ని ట్విట్టర్​ వేదికగా.. పంచుకున్నాడు విజయ్​. 'అక్డీ పక్డీ' కొరియోగ్రఫీ చూసినప్పుడు తాను ఏడ్చేశానని చెప్పుకొచ్చాడు విజయ్​ దేవరకొండ. కానీ.. షూటింగ్​లో మాత్రం.. డ్యాన్స్​ ఇరగదీశానని వివరించాడు. నిజానికి ఈ పాటలో అనన్యపాండేతో కలిసి విజయ్‌.. స్పీడ్​​ డ్యాన్స్​లో అదరగొట్టాడు.

ఈ సినిమాలో మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'అక్డీ పక్డీ' పాటను లిజో జార్జ్‌ డిజె చేతాస్‌ స్వరపరచగా.. సునీల్‌ కశ్యప్‌ హుక్‌లైన్‌ అందించారు. అజీమ్‌ దయాని సూపర్‌ వైజ్‌ చేశారు. తెలుగులో భాస్కర భట్ల సాహిత్యమందించగా.. అనురాగ్‌ కులకర్ణి, రమ్య బెహరా సంయుక్తంగా ఆలపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: జాలీ జాలీగా రణ్‌వీర్‌ సింగ్‌-దీపికా పదుకొణె.. ముద్దులతో మైమరిచిపోయి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.