Vijay Devarkonda VD 12 : రీసెంట్గా ఖుషి సినిమాతో సక్సెస్‌ను అందుకున్న ది విజయ్ దేవరకొండ.. తన తర్వాతి సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న సంగతి తెలిసిందే. మళ్లీరావా, జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామాలతో సూపర్ హిట్లను అందుకున్న తిన్ననూరి.. ఈ సారి రూట్ మార్చి గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.
ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ మురళీధర్ గౌడ్ కూడా నటిస్తున్నారని తెలిసింది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన కొత్త సినిమాల విషయల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తాను విజయ్ దేవరకొండ-సితార ఎంటర్టైన్మెంట్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి డెరెక్ట్ చేస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో తాను ఎస్సై పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు మురళీధర్. విజయ్ దేవరకొండ కానిస్టేబుల్‌గా నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ మాటలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి గతంలోనే ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పుడే విజయ్ దేవరకొండ పోలికలతో ఉన్న ఖాకీ చొక్కా కాన్సెప్ట్ పోస్టర్‌ను చిత్రబృందం పోస్ట్ చేసింది. కానీ అప్పుడు విజయ్ ఫేస్‌ను రివీల్ చేయలేదు.
అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు.. ఈ సినిమా గ్యాంగస్టర్ నేపథ్యంలో రాబోతుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ.. కానిస్టేబుల్ పాత్ర పోషిస్తున్నారని మురళిధర్ అన్నారు. దీంతో కానిస్టేబుల్‌కు గ్యాంగ్ స్టర్ వరల్డ్‌తో లింక్ ఎలా ఉండబోతుందా? లేదంటే పోలీస్‌గా ఉన్న విజయ్ గ్యాంగ్ స్టర్‌గా మారుతారా? అసలీ కథ ఎలా ఉండబోతుందా? అని విజయ్ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈ చిత్రానికి అనిరూధ్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం అనిరూధ్ వరుస హిట్ సినిమాలకు సెన్సేషనల్ మ్యూజిక్ అందిస్తూ గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. హీరోయిన్గా శ్రీలీల నటించనుంది.
Kushi Movie Success Meet : విజయ్ దేవరకొండ కీలక ప్రకటన.. ఫ్యాన్స్‌కు రూ.కోటి..
Vijay Devarakonda Marriage : విజయ్‌కు కోరికలు బానే ఉన్నాయిగా.. అలాంటి అమ్మాయే కావాలంట!