ETV Bharat / entertainment

ఆ షోకు గెస్ట్​గా విజయ్​-అనన్య.. డ్యాన్స్​ వీడియో వైరల్​! - లైగర్​ రిలీజ్ డేట్​

Vijay devarkonda Ananya pandey dance video: ఓ షోలో విజయ్‌ దేవరకొండ-అనన్య పాండే సందడి చేయబోతున్నారని తెలిసింది. తాజాగా అనన్య విజయ్​తో కలిసి డ్యాన్స్​ వేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాఫీ విత్ కరణ్
Vijay devarkonda ananya pandey coffee with karan
author img

By

Published : May 30, 2022, 5:15 PM IST

Vijay devarkonda Ananya pandey dance video: బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా ప్రేక్షకాదరణ పొందిన సెలబ్రిటీ చాట్‌ షో 'కాఫీ విత్‌ కరణ్‌'. 6 సీజన్లపాటు సాగిన ఈ షో.. రానున్న రోజుల్లో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో కరణ్‌ షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితా నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఈ జాబితాలో విజయ్‌ దేవరకొండ-రష్మిక ఉన్నారంటూ మొన్నటిదాకా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడీ షోలో విజయ్‌-అనన్య షోలో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌ షూట్‌ కూడా పూర్తైందంటూ, సెట్‌లో విజయ్‌ సంతకం చేసిన ఓ కాఫీ కప్‌ ఫొటో అంటూ సోషల్​మీడియాలో ప్రచారం సాగుతోంది. మరోవైపు అనన్య.. తన ఇన్​స్టాలో విజయ్​తో కలిసి త్వరలో విడుదల కానున్న 'జుగ్​ జుగ్​ జుగ్​ జియో' సినిమాలోని ఓ పాటకు స్టెప్పులేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. ఆ చిత్రానికి ఆల్​ ది బెస్ట్ చెప్పింది. ఈ డ్యాన్స్​ వీడియో కాఫీ విత్​ కరణ్​ షోలోనిది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

​కాగా, కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకున్న 'లైగర్‌' చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. విజయ్‌-అనన్య జంటగా నటించిన ఈసినిమాలో రమ్యకృష్ణ, మైక్‌ టైసన్‌ కీలకపాత్రలు పోషించారు. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆగస్టు నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌' బ్రిడ్జ్‌ సీక్వెన్స్‌.. ఇలా తెరకెక్కించారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.