ETV Bharat / entertainment

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్​కు బంపర్​ ఆఫర్​.. కాకపోతే అలా చేయాలంటా..! - మనాలి టూర్​ విజయ్​ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ తన ఫ్యాన్స్​ కోసం ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా బంపర్​ ఆఫర్​ అనౌన్స్​ చేశారు. 'దేవరశాంట' పేరుతో 100 మంది ఔత్సాహికులను 5 రోజుల పాటు విహార యాత్రకు పంపుతున్నట్లు ప్రకటించారు.

Vijay Devarakonda Devarasanta
Vijay Devarakonda
author img

By

Published : Jan 8, 2023, 9:35 PM IST

టాలీవుడ్‌లో రౌడీ హీరోగా ఫేమ్​ తెచ్చుకున్న సెన్సెషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ. గత ఐదేళ్ల నుంచి ప్రతి క్రిస్మస్‌ పండుగకు తన అభిమానులకు బహుమతులు అందిస్తున్న విషయం తెలిసిందే. ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్‌తో ఫ్యాన్స్​ను సర్​ప్రైజ్​ చేస్తుంటారు ఈ యంగ్​ హీరో. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకమైన థీమ్​​తో అభిమానుల​ను ఖుషీ చేశారు విజయ్​. దేవరశాంటా పేరుతో ఈసారి కూడా దేశాటన చేయాలని ఆసక్తి కలిగిన 100 మంది ఫ్యాన్స్​ను 5 రోజుల పాటు విహార యాత్రకు పంపనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి ఖర్చులను ఈ హీరోనే భరించనున్నాడు.

గతేడాది క్రిస్మస్‌ రోజున విజయ్‌ తన సోషల్‌మీడియాలో మీలోని 100 మందిని హాలిడే ట్రిప్‌ పంపించాలనుకుంటున్నా. టూర్​ స్పాట్​ను ఎంచుకోవడంలో నాకు సలహాలు ఇవ్వండి అని కోరుతూ భారత్‌లోని పర్వతాలు, చారిత్రక ప్రదేశాలు, బీచ్‌లు, ఎడారులను సూచించారు. వీటిలో ఎక్కువ మంది దేశంలోని పర్వతాలకు ఓటు వేశారు. ఇక తాజాగా దీనికి సంబంధించిన అప్‌డేట్‌ను ఓ వీడియో రూపంలో షేర్‌ తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేశారు విజయ్‌. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్​ అవుతోంది.

ఈ వీడియోలో విజయ్​ 'నేను మీలో 100 మందిని 5 రోజుల పాటు మనాలి టూర్​కు పంపుతున్నాను. మీరు ఆ మంచు పర్వతాల్లో ఎంజాయ్‌ చేయనున్నారు. అక్కడ ఉండే ప్రతి ప్రదేశాన్ని, దేవాలయాలు, మఠాలను చూడొచ్చు. మీ యాత్రకు సంబంధించిన ప్రణాళికను మేము సిద్ధం చేశాం. కాకపోతే గూగల్​ ఫామ్​ నింపే సమయానికి ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటి ఉండాలి.. దీనికి మీరు చేయాల్సిందల్లా నన్ను ఫాలో అయ్యే ప్రతిఒక్కరూ దేవరశాంట ఫారమ్‌ను ఫిల్ చేయాలి​. మీలో వంద మందిని ఎంపిక చేస్తాం. నేనూ మీ ప్రయాణంలో భాగం కావాలనుకుంటున్నాను. ట్రిప్‌ను ఎంజాయ్‌ చేయండి అంటూ మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' చెప్పారు విజయ్‌ దేవరకొండ.

కాగా ప్రస్తుతం డైరెక్టర్​ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమాలో నటిస్తున్నారు విజయ్​. ఇందులో విజయ్‌ సరసన కథానాయికగా సమంత అలరించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.