Veera Narasimha Reddy Collections: 'అఖండ' సినిమా తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రం 'వీర సింహారెడ్డి'. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా.. భారీ వసూళ్లను రాబట్టింది. సినిమా విడుదలై పదిరోజులు అవుతున్నా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుపిస్తోంది.
ఈ సినిమా పది రోజుల కలెక్షన్స్ చూసుకుంటే.. నైజాం 18.20 కోట్లు, సీడెడ్ రూ. 17 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.8.47 కోట్లు, తూర్పు గోదావరి రూ.5.45 కోట్లు, పశ్చిమ గోదావరి రూ. 4.70 కోట్లు, గుంటూరు రూ.6.59 కోట్లు, కృష్ణ రూ. 4.79 కోట్లు, నెల్లూరు రూ. 2.90 కోట్లు, తెలంగాణ ప్లస్ ఏపీ కలిపితే.. పది రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 68.12 కోట్లుగా ఉంది. కర్ణాటక ప్లస్ ఇతర ప్రాంతాలు రూ.5.25 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.98 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా పదిరోజులు కలిపి చూస్తే.. రూ.79.35 కోట్లు షేర్ (రూ.140.05 కోట్లు గ్రాస్) వసూళ్లు వచ్చాయి.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా శ్రుతి హాసన్, మలయాళీ బ్యూటీ హనీ రోజ్ నటించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సోదరిగా నెగెటివ్ షేడ్స్ కూడిన రోల్లో వరలక్ష్మి శరత్ కుమార్ అదరగొట్టింది. విలన్ క్యారెక్టర్లో దునియా విజయ్ నటించారు.
మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'వాల్తేరు వీరయ్య'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని,రవిశంకర్ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సందర్బంగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత చిరంజీవి మాస్ మసాలా పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. చిరు అవతార్‌కు.. ఆయన మాస్ యాక్టింగ్‌కు ఈలలు పడేలా చేసింది ఈ మూవీ. ఈ సినిమా తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.131 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం.