ETV Bharat / entertainment

బాలయ్యపై ఉన్న అభిమానాన్ని నా కొడుకు ద్వారా చూపించా: గోపీచంద్​ - గోపిచంద్​ మలినేని వీరసింహా రెడ్డి

హీరోల ఇమేజ్‌.. వాళ్ల అభిమానుల అభిరుచులకు తోడు తన శైలి మాస్‌ అంశాల్ని జోడిస్తూ విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు డెరెక్టర్​ గోపిీచంద్​ మలినేని. ఇటీవలే ఆయన బాలయ్య హీరోగా తెరకెక్కించిన 'వీరనరసింహారెడ్డి' చిత్రం విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

veera simha reddy movie director special interview
director gopichand malineni
author img

By

Published : Jan 14, 2023, 6:31 AM IST

తొలి అడుగుల్లోనే మాస్‌ నాడి పట్టిన దర్శకుడు.. గోపీచంద్‌ మలినేని. కథానాయకుల ఇమేజ్‌..వాళ్ల అభిమానుల అభిరుచులకి తోడు తన శైలి మాస్‌ అంశాల్ని జోడిస్తూ విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. 'క్రాక్‌' తర్వాత బాలకృష్ణతో జట్టు కట్టగానే ఈ కలయికపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. 'వీరసింహారెడ్డి'తో ఆ అంచనాల్ని అందుకుని మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సినిమాకి లభిస్తున్న స్పందనపై సంతృప్తిని వ్యక్తం చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు గోపీచంద్‌ మలినేని.

  • "ప్రారంభంలోనే ఈ సినిమాని అవకాశంలా కాకుండా ఓ బాధ్యతలా భావించాను. 'అఖండ'తోపాటు అన్‌స్టాపబుల్‌ షో వల్ల బాలకృష్ణపై ప్రేక్షకుల్లో మరింతగా క్రేజ్‌ పెరిగింది. యువతరంలోకి, కుటుంబ ప్రేక్షకులకి మరింతగా కనెక్ట్‌ అయ్యారు. ఆయనకి ఒకప్పుడు అభిమానులు వేరు, ఇప్పుడు అభిమానులు వేరు. ఇతర హీరోల అభిమానులు కూడా బాలకృష్ణకి అభిమానులయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావించా. నాకొచ్చిన అవకాశాన్ని పక్కాగా వాడుకోవాలని, ఒక అభిమానిగా ఆయన్ని ఎలా చూడాలనుకున్నానో అలాంటి మాస్‌ విషయాల్ని జోడించి ఈ కథ రాసుకున్నా. 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు' సినిమాలు ఆయన కెరీర్‌లో ఘన విజయాలు. భావోద్వేగాలతో కూడిన ఫ్యాక్షన్‌ కథలు అవి. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడున్న తరానికి కూడా ఆ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ, గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌గా ఆయనకున్న ఇమేజ్‌ని వాడుకుంటూ 'వీరసింహారెడ్డి' చేశా. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ఎంతో తృప్తినిచ్చింది. సినిమా చూశాక చాలా మంది మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి నన్ను అభినందించారు. సెంటిమెంట్‌ వాళ్లకి అంతగా చేరువైంది".
  • "బాలకృష్ణతో నేను సినిమా చేస్తున్నానని తెలిశాక.. అంతకుముందు నేను చేసిన 'క్రాక్‌'ని దృష్టిలో ఉంచుకుని ఇందులోనూ మాస్‌ - యాక్షన్‌ అంశాలు అదిరిపోతాయని ఊహించారంతా. ఆ అంచనాలకి తగ్గట్టుగా వాటిని జోడిస్తూనే ద్వితీయార్థంలో అన్నా చెల్లెళ్ల బంధం నేపథ్యంలో కథని చెప్పాం. అది ప్రేక్షకులకి మరింతగా కనెక్ట్‌ అయ్యింది. బాలకృష్ణ కెరీర్‌లో ఘన విజయాల్ని అందుకున్న సినిమాల్ని గమనిస్తే..వాటిలో కుటుంబాలకి కనెక్ట్‌ అయ్యే అంశాలు కూడా ఉంటాయి. ఇందులో కూడా అదే అంశం కీలకంగా మారింది. బాలకృష్ణ కంటతడి పెట్టడం, విరామానికి ముందు సన్నివేశాలు చూసి కుటుంబ ప్రేక్షకులు కథ, పాత్రల్ని మరింతగా సొంతం చేసుకున్నారు. అదే ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అన్నాచెల్లెళ బంధం అంటే చెల్లెలు కష్టాల్లో పడటం, ఆమెని కథానాయకుడు రక్షించడం చూస్తుంటాం. కానీ ఇందులో కథ అందుకు విరుద్ధంగా సాగుతుంది. ఇలాంటి అంశాన్ని పక్కాగా తెరపైకి తీసుకురావడం కత్తిమీద సాము. నేను, బాలకృష్ణ, నిర్మాతలు కథని బలంగా నమ్మాం. వరలక్ష్మి శరత్‌కుమార్‌ తన నటనతో ఆ పాత్రపై అంతే ప్రభావం చూపించింది. ప్రేక్షకులతో కంటతడి పెట్టించడం అంత సులభం కాదు. ప్రథమార్థం వరకు నేనొక అభిమానిగా పనిచేశా, ద్వితీయార్థంలో నాలోని దర్శకుడు కనిపిస్తాడు".
  • "నాలో చాలా మాస్‌దనం ఉంది. ఈ కథకి ఎంత కావాలో అంతే తీసుకొచ్చా. భవిష్యత్తులో ఇంకా చాలా చూస్తారు. స్వతహాగా నేను మాస్‌ సినిమాలకి పెద్ద అభిమానిని. అలాంటి సినిమాలే ఎక్కువగా చూస్తా. చిత్ర పరిశ్రమలో అందరు మాస్‌ హీరోలతోనూ సినిమాలు చేయాలని ఉంది. ఒకొక్క కథతో ఒక్కో మాస్‌ కోణాన్ని ఆవిష్కరిస్తా. తదుపరి సినిమాపై ఇంకా దృష్టిపెట్టలేదు. ప్రస్తుతం సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నా".
  • "కథలో భాగంగానే సంభాషణలు రాశారు రచయిత సాయిమాధవ్‌ బుర్రా. కావాలని ఏ ఒక్క మాటని జోడించలేదు. బాలకృష్ణ గెటప్‌ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ముందే స్కెచ్‌లు వేసుకుని కథ, పాత్రల రీత్యా లుక్‌ని డిజైన్‌ చేశాం. ఒక్కసారి కనెక్ట్‌ అయితే సాంకేతిక నిపుణుల్ని మార్చను. తమన్‌, రామ్‌లక్ష్మణ్‌, ప్రకాశ్‌... వీళ్లతో మొదట్నుంచీ నా ప్రయాణం కొనసాగుతోంది. నేను పనిచేసినవాళ్లలో అత్యుత్తమం ఈ నిర్మాతలు. 'క్రాక్‌' విడుదలకి ముందే నన్ను పిలిచి సినిమా చేద్దామన్నారు. నేను అభిమానించే బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌ల కోసం కథలు సిద్ధం చేసుకున్నానని చెప్పినప్పుడు మొదట బాలకృష్ణతో సినిమా చేద్దామని ముందుకొచ్చారు. ఈ సంస్థలో మళ్లీ మళ్లీ సినిమాలు చేస్తుంటా. నేను అభిమానించే పవన్‌కల్యాణ్‌తోనూ తప్పకుండా సినిమా చేస్తా. బాలకృష్ణపై నాకున్న అభిమానాన్ని మా అబ్బాయి పాత్రతో చూపించా (నవ్వుతూ). తన అమ్మ, నాన్నల చావుకి కారణమైన ఓ రాక్షసుడిపై పగ పెంచుకుని కథానాయకుడిని ఆశ్రయించే బాలుడిగా మా అబ్బాయి చాలా బాగా నటించాడు".

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.