ETV Bharat / entertainment

వరుణ్​-లావణ్యల పెళ్లి కాస్ట్యూమ్స్​ - వామ్మో ఎన్ని లక్షలో తెలుసా? - వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం

Varun Tej Lavanya Wedding Costumes Price : మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం ఇటలీలో జరిగిన డెస్టినేషన్​ వెడ్డింగ్​లో హీరోయిన్​ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశాడు నాగబాబు తనయుడు వరుణ్​ తేజ్​. అయితే ఈ వేడుకలో వధూవరులు ఇద్దరు వేసుకున్న కాస్ట్యూమ్స్​ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వారి ధర ఎన్ని లక్షలంటే?

Varun Tej Lavanya Wedding Costumes Designer
Varun Tej Lavanya Tripathi Wedding Dress
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 2, 2023, 12:14 PM IST

Varun Tej Lavanya Wedding Costumes Price : మెగా బ్రదర్ నాగబాబు - పద్మజ తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దేవరాజ్ - కిరణ్ త్రిపాఠిల కుమార్తె లావణ్య త్రిపాఠిల వివాహం బుధవారం ఇటలీలో అట్టాహాసంగా జరిగింది. మెగా ఫ్యామిలీ, బంధువుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. మూడు రోజుల పాటు గ్రాండ్​గా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్​లో చివరి రోజు లావణ్య మెడలో మూడు ముళ్లు వేశారు వరుణ్​ తేజ. ఇటలీలోని అత్యంత పూరాతన గ్రామం అయిన టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. విశేషం ఏంటంటే.. వీరిద్దరు పెళ్లి చేసుకున్న చోటే తమ ప్రేమను మొదటి సారి ఒకరినొకరికి చెప్పుకున్నారట. అయితే ఈ వివాహ తంతులో వధూవరులిద్దరూ ధరించిన పెళ్లి డ్రెస్​ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

డిజైనర్​ ఎవరంటే.. తమ పెళ్లిలో వరుణ్ తేజ్ క్రీమ్​ కలర్డ్​ గోల్డ్ షేర్వానీలో మెరవగా.. లావణ్య త్రిపాఠి ప్రత్యేకంగా కూర్చిన ఎరుపు రంగు కాంచీపురం చీరలో యువరాణిలా కనిపించింది. అయితే ఈ పెళ్లి కాస్ట్యూమ్స్​ను డిజైన్​ చేసింది మరెవరో కాదు.. వెడ్డింగ్ డిజైనర్​గా పేరొందిన మనీశ్​ మల్హోత్రా. ఈయన దేశంలోని పలు సెలబ్రిటీల వివాహాలకు ఇప్పటివరకు ఎన్నో రకాల కాస్ట్యూమ్స్​ను డిజైన్​ చేశారు.

పంచకట్టులో మెగా బ్రదర్స్​.. అయితే ఈ పెళ్ళి డ్రెస్ కోసం లక్షల్లో ఖర్చు అయినట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉంటుందని ఓ అంచనా. ఇక ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామలీ మొత్తం హాజరయ్యారు. అన్నదమ్ములు మెగాస్టార్​ చిరంజీవి లైట్​ గ్రీన్​ కలర్​ కుర్తాలో, నాగబాబు క్రీమ్​ కలర్​ కుర్తా, పంచకట్టులో కనిపించారు. అలాగే మిగతా మెగా హీరోలైన ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్, అల్లు శిరీష్​, సాయిధరమ్​ తేజ్​, వైష్ణవ్ తేజ్​లు కూడా కుర్తా పైజామా ధరించి పైనుంచి కోట్​ ధరించారు. ఇక గ్లోబల్ స్టార్​ రామ్​ చరణ్​, పవర్ స్టార్​ పవన్​ కల్యాణ్​ మాత్రం సింపుల్​గా క్యాజువల్స్ దుస్తుల్లో కనువిందు చేశారు.

వారికోసం గ్రాండ్​గా రిసెప్షన్​.. నవంబర్ 1న జరిగిన ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ, లావణ్య కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఈ వారంలోనే హైదరాబాద్​లో గ్రాండ్​గా రిసెప్షన్​ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ ఫంక్షన్​కు ఇండస్ట్రీ ప్రముఖులు, సినీ తారలు, రాజకీయ నేతలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

పర్ఫెక్ట్​ పిక్చర్​ - వరుణ్​, లావణ్యతో కలిసి సింగిల్​ ఫ్రేమ్​లో మెగా హీరోస్

వరుణ్ తేజ్ - లావణ్యకు పవన్​ కల్యాణ్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? ఇప్పుడు ఈ ఫొటోలే ఫుల్ ట్రెండింగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.