వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా బాక్సింగ్ కథాంశంగా తెరకెక్కుతున్న చిత్రం గని. ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో వరుణ్ బాక్సింగ్ సన్నివేశాలు, డాన్స్, ఇతర సన్నివేశాలు చిత్రీకరించే దృశ్యాలను చూపించారు. బన్ని కూడా ఈ వీడియోలో కనిపించారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు, అల్లు అరవింద్ సమర్పకులు. జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దర్జా చిత్రంలో శివంగి పాట..
మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దర్జా. సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని శివంగి పాటను దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు విడుదల చేశారు. దర్జా చిత్రాన్ని చాలా బాగా చిత్రీకరించారని, పుష్ప చిత్రంతో జోడి కట్టిన సునిల్, అనసూయలు దర్జా చిత్రంలోనూ మెప్పిస్తారని రాఘవేందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన రాఘవేందర్ రావు.... దర్జా చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాప్ రాక్ షకీల్ సంగీత సారథ్యంలో శివంగి పాటను ప్రముఖ నటుడు ఉత్తేజ్ తన కుమార్తె పాటతో కలిసి ఆలపించడం విశేషం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
షూటింగ్ షురూ..
యువ నటుడు విశ్వంత్, శుభశ్రీ జంటగా అలీ, సునీల్, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నూతన చిత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. విశ్వంత్, సునీల్ పై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ హాస్యనటుడు అలీ క్లాప్ కొట్టగా... దండమూడి అవనీంద్ర కుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నేటి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.