Varun Tej Lavanya Wedding Reception : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - హీరోయిన్ లావణ్య త్రిపాఠిల రిసెప్షన్ హైదరాబాద్‌లోని మాదాపూర్ ఎన్-కన్వెన్షన్‌లో ఆదివారం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు అక్కినేని నాగచైతన్య, కమెడియన్ అలీ, సునీల్, యాంకర్ సుమ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నటులు రాజేంద్ర ప్రసాద్, సుబ్బరాజు సహా పలువురు సినీనటులు, సెలబ్రిటిలు, వ్యాపారవేత్తలు హాజరయ్యి.. కొత్త జంటను ఆశీర్వదించారు.
ఇటలీలో ఒక్కటైన జంట.. మెగా బ్రదర్ నాగబాబు - పద్మజ తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దేవరాజ్ - కిరణ్ త్రిపాఠిల కుమార్తె లావణ్య త్రిపాఠిల వివాహం.. డెస్టినేషన్ పద్ధతలో ఇటలీలో జరిగిన విషయం తెలిసిందే. ఇటలీ టస్కానీ వేదికగా నవంబర్ 1 బుధవారం రాత్రి 7.18 గంటలకు ఈ జంట ఒక్కటైంది. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు సహా, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇలా కొణిదెల, అల్లు ఫ్యామిలీకి చెందిన స్టార్ అండ్ యంగ్ హీరోస్ అందరూ షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి.. ఈ వేడుకల్లో సందడి చేశారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక టాలీవుడ్ మరో హీరో నితిన్, ఆయన సతీమణి షాలినీ, నీరజా కోన కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.
స్పెషల్ అట్రాక్షన్‌గా క్యాస్ట్యూమ్స్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. తన పెళ్లిలో క్రీమ్ కలర్డ్ గోల్డ్ షేర్వానీ ధరించారు. పెళ్లి కూతూరు లావణ్య త్రిపాఠి ప్రత్యేకంగా కూర్చిన ఎరుపు రంగు కాంచీపురం చీరలో వేడుకకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే అంత అందంగా ఈ పెళ్లి కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేసింది మరెవరో కాదు.. ఫేమస్ వెడ్డింగ్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా. ఆయన దేశంలోని అనేక మంది సెలబ్రిటీల వివాహాలకు ఇప్పటివరకు ఎన్నో రకాల కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేశారు.
Varun Lavanya Marriage : కాక్టెయిల్ పార్టీ గ్యాలరీ.. రామ్‌చరణ్ - అల్లు అర్జున్ ఫుల్ ఆపోజిట్‌గా!
Varun Lavanya Marriage : వరుణ్- లావణ్య పెళ్లికి చిరంజీవి తల్లి దూరం.. కారణమిదే!