ETV Bharat / entertainment

Varun Lavanya Marriage : ఇటలీ బయల్దేరిన పవన్‌, అల్లు అర్జున్​ ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్! - వరుణ్​ తేజ్​ లావణ్య త్రిపాఠి పెళ్లి వేదిక

Varun Lavanya Marriage : మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠిల పెళ్లి కోసం పవన్‌ కల్యాణ్ కుటుంబసమేతంగా ఇటలీ బయల్దేరారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Varun Lavanya Marriage
Varun Lavanya Marriage
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2023, 1:33 PM IST

Varun Lavanya Marriage : టాలీవుడ్​ స్టార్​ హీరో పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్, ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​​ తమ కుటుంబసభ్యులతో హైదరాబాద్‌ ఎయిర్​పోర్టులో కనిపించారు. వీరందరూ వరుణ్​- లావణ్య పెళ్లి వేడుకల కోసం ఇటలీకి బయలుదేరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్​ అవుతోంది.

నవంబర్‌ 1న వరుణ్‌ -లావణ్య పెళ్లి జరగనునున్న నేపథ్యంలో ఇప్పటికే రామ్‌ చరణ్‌, ఉపాసన అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వరుణ్ తేజ్‌, లావణ్య కూడా పయనమయ్యారు. ఇక మెగా-అల్లు ఫ్యామిలీ మెంబర్స్​ కూడా నేడు వెళ్లనున్నట్లు సమాచారం.

డెస్టినేషన్​ వెడ్డింగ్​గా ఈ వేడుక జరగనుండగా.. దీనికి సంబంధించిన పనులు అప్పుడే మొదలయ్యాయి. ఇక ప్రీవెడ్డింగ్‌ వేడుకల్లో భాగంగా అక్టోబర్‌ 30న కాక్‌టేల్‌ పార్టీతో మొదలై 31న హల్దీ, మెహందీ ప్రోగ్రాంస్​ను నిర్వహించనున్నారు. ఆ తర్వాత నవంబర్​ 1న అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వరుణ్​- లావణ్య ఒక్కటవ్వనున్నారు. ఇక అక్కడి నుంచి తిరిగి వచ్చాక నూతన వధూవరులు నవంబర్‌ 5న సినీ ఇండస్ట్రీలోని ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించనున్నారు.

Varun Lavanya Wedding Card : తాజాగా వీరి పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. సిల్వర్ కలర్‌లో ఉన్న ఆ కార్డు చూడటానికి ఎంతో అట్రాక్టివ్​గా ఉంది. అందులో మొదట వరుణ్ తాత, నాన్నమ్మల పేర్లను పెట్టారు. ఆ తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్​, రామ్ చరణ్ పేర్లను ముద్రించారు. ఈ పేర్లతో పాటు వరుణ్ తల్లిదండ్రుల పేర్లు నాగబాబు, పద్మజ, లావణ్య తల్లిదండ్రులు కిరణ్, దియోరాజ్ త్రిపాఠి పేర్లు కూడా పెళ్లి కార్డులో ఉన్నాయి. దీన్ని చూసిన ఫ్యాన్స్​ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. వెడ్డింగ్ కార్డులో తమ స్టార్స్​ పేర్లు చూసి తెగ సంబరపడుతున్నారు.

Varuntej Lavanya Tripathi Pre Wedding Party : రీసెంట్​గా మెగాస్టార్​ చిరంజీవి నివాసంలో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరగ్గా.. తాజాగా అల్లు వారి ఇంట్లో మరో గ్రాండ్‌ పార్టీ జరిగింది. కాబోయే వధూవరులకు అభినందనలు తెలుపుతూ.. హీరో అల్లు అర్జున్‌ ఫ్యామిలీ మెంబర్స్​ ఈ పార్టీని ఏర్పాటు చేశారు. మెగాస్టార్​ చిరంజీవి, అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులతో పాటు హీరో నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, నటి రీతూవర్మ, పలువురు సన్నిహితులు ఈ పార్టీకి హాజరై సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను అల్లు శిరీష్‌ సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. "త్వరలో జరగనున్న వరుణ్‌ - లావణ్య పెళ్లి సందర్భంగా మా ఇంట్లో ఓ పార్టీ జరిగింది" అని రాసుకొచ్చారు.

Varun Tej Lavanya Pre Wedding : చిరంజీవి ఇంట్లో వరుణ్​- లావణ్య ప్రీవెడ్డింగ్​ సెలబ్రేషన్స్​.. మస్త్​ ఎంజాయ్​ చేశారుగా!

Varun Tej Lavanya Tripati Wedding : పెళ్లి షాపింగ్​లో వరుణ్-లావణ్య బిజీ.. క్యూట్​ వీడియో చూశారా ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.