ETV Bharat / entertainment

సంక్రాంతి ఫైట్​లో 100% సక్సెస్ రేట్- ఈ పాత్రలు కెరీర్​లోనే హైలైట్!

Varalakshmi Sankranti Movies: టాలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్​కుమార్ కెరీర్​లో ఫుల్​ స్వింగ్​లో ఉంది. సహాయ నటి పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ భామ. కాగా, ఈమె నటించిన సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్​బస్టర్​ అయ్యాయి.

Varalakshmi Sankranti Movies
Varalakshmi Sankranti Movies
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2024, 10:52 PM IST

Varalakshmi Sankranti Movies: యంగ్ నటి వరలక్ష్మి శరత్​కుమార్ సహాయ పాత్రల్లో నటిస్తూ టాలీవుడ్​లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రిలీజైన హనుమాన్ సినిమాలోనూ హీరో తేజ సజ్జకు సోదరి క్యారెక్టర్​లో అదరగొట్టేసింది. గ్లామరస్ పాత్రల్లో కాకుండా లేడీ విలన్​గా వరలక్ష్మి పెర్ఫార్మెన్స్​కు ఫ్యాన్స్​ ఎక్కువగా ఉన్నారు. అయితే ఈమె నటించిన సినిమాలు ఇప్పటికి మూడుసార్లు సంక్రాంతి బరిలో నిలిచి హిట్​ కొట్టాయి. దీంతో వరలక్ష్మి సంక్రాంతి లక్కీ ఛార్మ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఆమె సంక్రాంతికి వచ్చి విజయం సాధించిన సినిమాలేవంటే?

క్రాక్: రవితేజ బ్లాక్​బస్టర్​ క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో ఒదిగిపోయింది వరలక్ష్మి. ఈ సినిమాలో వరలక్ష్మి పాత్ర దాదాపు మెయిన్ విలన్​కు సమానంగా ఉంటుంది. స్క్రీన్ షేరింగ్ టైమ్​ కూడా ఎక్కువే. ఈ సినిమా 2021లో సంక్రాంతి బరిలో నిలిచి బంపర్ హిట్ కొట్టింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్​గా చేసిన శ్రుతిహాసన్​ కంటే వరలక్ష్మి పాత్రే ఎక్కువ పాపులర్ అయ్యింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వీర సింహారెడ్డి: నటసింహం నందమూరి బాలకృష్ణ గతేడాది వీరసింహారెడ్డి మూవీతో సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ సినిమాలో వరలక్ష్మి, బాలకృష్ణకు చెల్లి పాత్రలో నటించింది. ఈ మూవీలో పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్​లో నటనతో వరలక్ష్మి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో కూడా శ్రుతి హాసన్​ మెయిన్​ హీరోయిన్​గా నటించడం విశేషం.

హనుమాన్: జనవరి 12న రిలీజైన హనుమాన్ హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. ఈ పొంగల్​ ఫైట్​లో పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కంటెంట్​ను నమ్ముకున్న మేకర్స్ బ్యాక్ స్టెప్ వెయ్యలేదు. వారు ఆశించినట్లుగానే సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వరలక్ష్మి హీరోకు అక్క పాత్రలో నటించింది. తన తమ్ముడి జోలికి వస్తే విలన్ల భరతం పడుతుందన్నట్లుగా ట్రైలర్​లోనే చూపించారు. ఇక మూవీలోనూ ఈమె క్యారెక్టర్​కు మంచి మార్కులు పడ్డాయి. ఇలా గత నాలుగేళ్లలో ఈమె నటించిన మూడు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధించడం విశేషం.

టాలీవుడ్​కు మరో పవర్​ఫుల్​ లేడీ విలన్​ దొరికేసిందోచ్​.. జూ.రమ్యకృష్ణ అంటూ నెట్టింట ట్వీట్స్​

వరలక్ష్మీ శరత్​కుమార్​@10 ఏళ్లు.. సినీ జర్నీపై యశోద నటి ఎమోషనల్​ పోస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.