KGF 2 song released: దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'కేజీఎఫ్ ఛాప్టర్ 2' ఒకటి. కన్నడ నటుడు యశ్ కథానాయకుడిగా విడుదలైన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం 'కేజీఎఫ్-1'కు ఇది స్వీకెల్. వచ్చే నెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్రబృందం తాజాగా మరో పాటను అన్ని భాషల్లో విడుదల చేసింది. తెలుగులో 'యదగర యదగర' అంటూ సాగే ఈ గీతం మనసును హత్తుకునేలా ఉంది. కాగా, ఈ 'కేజీఎఫ్ 2'కు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ఈ చిత్రంలో 'అధీరా' అనే బలమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సీనియర్ నటి రవీనాటాండన్, రావురమేష్, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Vijay Vamsi paidipally new movie: కోలీవుడ్ స్టార్ ఇళయ దళపతి విజయ్ తన 66వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వం చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నేడు(బుధవారం) చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్, హీరోయిన్ రష్మిక సహా దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్ పాల్గొన్నారు. కాగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్-పూజా హెగ్డే కలిసి నటించిన 'బీస్ట్' ఏప్రిల్ 13న థియేటర్లలో విడుదల కానుంది.
![vijay vamsipaidipally movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14943084_vijay23.jpg)
![vijay vamsipaidipally movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14943084_vijay123.jpg)
![vijay vamsipaidipally movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14943084_vijay.jpg)
Actor Satyadev new movie: 'బ్లఫ్ మాస్టర్' సినిమాతో అందరిని ఆకట్టుకున్న హీరో సత్యదేవ్. తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు ‘ఫుల్ బాటిల్’ అనే ఆసక్తికర పేరు ఖరారు చేశారు. ముహుర్తం ఫంక్షన్ ఈ రోజు హైదరాబాద్‌లో జరిగింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను రామాంజనేయులు జువ్వాజితో కలిసి ఎస్డీ కంపెనీ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌ని బట్టి చూస్తే మూవీ కాకినాడ బ్యాక్ గ్రౌండ్‌లో జరిగినట్లు తెలుస్తుంది. 78.1 శాతం వినోదం, 21.9 శాతం యాక్షన్‌తోనిండిన ‘ఫుల్ బాటిల్’ కోసం అందరూ సిద్ధంగా ఉండండి అంటూ హిరో సత్యదేవ్ ట్వీట్ చేశారు.
![satyadev full bottle movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14943084_satyadev.jpg)
ఇదీ చూడండి: చైతూ కొత్త సినిమా ప్రకటన.. ఆస్కార్ విన్నింగ్ సినిమాలో అడవిశేష్