ETV Bharat / entertainment

Ustaad Bhagat Singh Remake : 'పవన్​ ఉస్తాద్​ భగత్​సింగ్​ రీమేక్​?'.. హరీశ్​ శంకర్​ రిప్లై ఏంటంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 8:23 PM IST

Ustaad Bhagat Singh Remake : పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​ హరీశ్ శంకర్ కాంబినేషన్​లో తెరకెక్కుతున చిత్రం 'ఉస్తాద్​ భగత్​సింగ్'. ఈ చిత్రంపై హరీశ్​ శంకర్ ఎక్స్ ద్వారా నెటిజన్ల ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ సమాధానాలు ఇచ్చారు. ఆ సంగతులు..

Ustaad Bhagat singh : ఉస్తాద్​ భగత్​సింగ్​ రీమేకా.. హరీశ్​ శంకర్​ ఏమన్నారంటే?

Ustaad Bhagat Singh Remake : పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్​ హీరోగా డైరెక్టర్ హరీశ్​ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న యాక్షన్​ చిత్రం 'ఉస్తాద్​ భగత్​సింగ్'. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గబ్బర్‌ సింగ్‌ తరువాత పవన్‌-హరీశ్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో రానున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన మోస్ట్‌ వాంటెడ్ హీరోయిన్‌ శ్రీలీల నటిస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రంలో ఇటీవలే ముఖ్యమైన భాగాన్ని పూర్తి చేశారు.

అయితే ఈ సినిమా రీమేకా అని నెటిజన్​ అడిగిన ప్రశ్నకు దర్శకుడు హరీశ్​ శంకర్​ ఎక్స్ వేదికగా సమాధానం చెప్పారు. "నాపై నమ్మకం ఉంచండి. మీ ఎదురుచూపులకు తగ్గట్లు సినిమా ఉంటుంది. మీరు ఎంత భారీగా అంచనాలు పెట్టుకున్నా.. వాటిని ఈ చిత్రం కచ్చితంగా అందుకుంటుంది" అని సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో #Askharish పేరుతో ఎక్స్‌లో చాట్​ నిర్వహించి అభిమానులతో ముచ్చటించారు. ఇందులో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన అప్‌కమింగ్‌ సినిమాలకు సంబంధించిన విశేషాలను షేర్​ చేశారు.

'మీ సినిమాలు రీమేక్‌లా ఉంటాయని టాక్ వినిపిస్తుంటుంది. మీరు కాపీ కంటెంట్‌ వాడతారా?' అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. "నా వర్క్‌ నిజంగా తెలిసిన వారు వాటిని రీమేక్‌లు అని పిలవడానికి సిగ్గుపడతారు. నా పనిని చూసి నేనెప్పుడూ గర్వపడుతుంటా. విమర్శించేవారు ఉన్నప్పుడే మనం ఇంకా మెరుగ్గా ప్రయత్నిస్తాం" అని హరీశ్​ శంకర్​ బదులిచ్చారు.

ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ కూడా గబ్బర్‌సింగ్‌ రేంజ్‌లో ఉంటుందా?
హరీశ్‌ శంకర్‌: పనిచేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం కాదు. అయినా.. దానికి మించి ఉండాలని కోరుకుందాం.

ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా?
హరీశ్‌ శంకర్‌: కచ్చితంగా చూడొచ్చు. ఇది యూత్‌, మాస్ ఆడియన్స్‌కు కూడా నచ్చుతుంది. ప్రతి ప్రేక్షకుడికి కన్నుల పండుగగా ఉంటుంది.

ఇలాంటి పెద్ద సినిమా తీస్తున్నప్పుడు ఒత్తిడి గురైతారా?
హరీశ్‌ శంకర్‌: ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. కానీదాన్ని జయించగలగాలి.

భవిష్యత్తులో ఏ జోనర్‌లో సినిమాలు తీస్తారు?
హరీశ్‌ శంకర్‌: మానవ సంబంధాలు, లవ్‌స్టోరీలు.. ఈ రెండు జోనర్‌లలో తీస్తాను.

OG - Gunturu Karam - Devara Updates : దసరా స్పెషల్​.. పవన్-మహేశ్​-ఎన్టీఆర్ నుంచి అదిరిపోయే అప్డేట్స్

Pawan Kalyan Upcoming Projects : పవన్ ఫ్యాన్స్​.. వీటిపై అస్సలు ఆశలు పెట్టుకోవద్దు.. డౌటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.