ETV Bharat / state

ఆటలు ఆడేందుకు ఫిట్‌గా ఉన్నారా? - లేకపోతే ప్రాణాలతో చెలగాటమాడినట్లే! - HEART ATTACKS WHILE WORKOUT

ఆటలాడుతూ, వ్యాయమాలు చేస్తూ మరణిస్తున్న యువత - అందుకు ప్రధాన కారణాలు ఇవేనంటున్న నిపుణులు

Heart Attacks While Workout and Playing
Heart Attacks While Workout and Playing (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 2:03 PM IST

Updated : Jan 29, 2025, 4:44 PM IST

Heart Attacks While Workout and Playing : ఇటీవల కాలంలో ఆటలు ఆడుతున్నప్పుడు, డ్యాన్స్​, వ్యాయామం చేస్తున్నప్పుడు చాలా మంది ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా చనిపోతున్నారు. వీరిలో ఎక్కువగా చిన్నారులే ఆటలు ఆడుతూ మృత్యువాత పడుతున్న ఘటనలు ఉన్నాయి. వీటన్నింటికీ ఒకే కారణం గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలా గుండెపోటుకు గురికాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆటలు ఆడటం, వ్యాయామం చేస్తే ప్రాణాలు కాపాడుకునేవాళ్లు అవుతారని నిపుణులు చెబుతున్నారు.

ఈ మధ్యకాలంలో అలా ఆడుతూపాడుతూ మరణించిన కొన్ని ఘటనలు :

  • మొదటి బంతికే ఔటైన ఓ యువకుడు బ్యాట్ పక్కన పడేసి వెనుదిరుగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి క్రీడాకారులు సపర్యలు చేసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఓ యువకుడు (27) క్రికెట్‌ ఆడుతూ మరణించాడు.
  • ఖమ్మం నగరానికి చెందిన ఓ యువకుడు 2023 జులై 10వ తేదీ జిమ్​లో కాసేపు సాధన చేశారు. ఇంటికి తిరిగొస్తున్న క్రమంలో తనకు గాలి ఆడటం లేదని కుటుంబీకులకు తెలిపారు. ఆసుపత్రికి తరలించేలోగా యువకుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

ఎందరో ఆటకు దూరం : మైదానంలో ఆటలాడుతూ ఒకరు, జిమ్‌లో సాధన చేస్తూ మరొకరు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. భారత జట్టులో ఫిట్‌నెస్‌ నిరూపించుకోలేదని సచిన్ తెందూల్కర్‌ లాంటి దిగ్గజ క్రికెటర్‌ను ఆటకు ముందు ఆపిన సందర్భాలున్నాయి. 50 ఓవర్ల మ్యాచ్ ఆడేందుకు శారీరకంగా సిద్ధంగా ఉన్నారా లేదా అని తేల్చేందుకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. భారత జట్టులో ఇప్పటివరకు ఆడిన మహామహులు సైతం అందరూ ఏదో ఒక సందర్భంలో ఫిట్‌నెస్ పరీక్షల ద్వారా ఆటకు దూరమైన సందర్భాలు ఉన్నాయి. కసరత్తు లేకుండా బ్యాట్, బంతి తీసుకుని బయల్దేరితే ప్రమాదంతో చెలగాటమాడినట్టేనని కపిల్‌దేవ్ లాంటి ఉద్ధండ క్రికెటర్ అనేక వేదికలపై చెప్పారు.

రోజంతా యాక్టివ్​గా ఉండాలా? ఈ వ్యాయామాలు ట్రై చేయండి!

ప్రమాణాలిలా : తొమ్మిది కిలోమీటర్లు పరిగెత్తి ఆయాస పడకూడదు. ఆగకుండా 100 స్కిప్పింగ్స్‌ చేసినా సాధారణంగానే ఉండాలి. అంతటి శారీరక సామర్థ్యం కలిగినవారు మాత్రమే బ్యాడ్మింటన్ సింగల్స్‌ గేమ్‌లో నిలబడగలరు. 45 కిలోమీటర్ల పరుగు తీసినా అలసట చెందని సామర్థ్యం ఉన్నవారు ఫుట్‌బాల్‌ ఆట ఆడగలరు. 16 కిలోమీటర్లు పరుగు తీసినప్పటికీ అలసట చెందనంత శారీరక సామర్థ్యం కలిగి, భుజబలం, కండబలం, ఐ(దృష్టి), కదలిక (ఫుట్‌వర్క్‌), ఏకకాలంలో స్పందించే చురుకుదనం ఉన్నవారు 50 ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌ ఆడగలరు.

ఇలా ఒక్కో క్రీడకు అందుకు అనువైన శారీరక ప్రమాణాలు ఉన్నాయి. వాటిన అందుకునేందుకు క్రీడాకారులు ఫిట్‌నెస్‌ నిపుణుల సమక్షంలో సంవత్సరాల తరబడి వ్యాయామాలు చేస్తారు. వాటికి తోడు రక్షణ పరికరాలు కవచంగా ఉంటూ క్రీడాకారుడిని సురక్షితంగా ఉంచుతాయని క్రీడా నిపుణులు చెబుతున్నారు. స్థాయిగల శిక్షకులు ఉన్న శిబిరాల్లో మినహా మరెక్కడా వీటి గురించి ప్రస్తావన ఉండడం లేదు. గుండెపోటుతో కుప్పకూలారని వదిలేస్తున్నప్పటికీ అందుకు గల కారణాలను విశ్లేషించాలని క్రీడా నిపుణలు సూచిస్తున్నారు.

అందుకే ప్రమాదాలకు గురవుతున్నారు : వ్యాయామానికి ముందు వయసుకు తగిన కసరత్తులను ఎంచుకోవాలని ఫిట్‌నెస్ కోచ్ తిరుపతి తెలిపారు. ఆటైనా, సాధారణ వ్యాయామాలు ఏవైనా మోతాదు క్రమంగా పెంచుకుంటూ పోవాలని సూచించారు. చలికాలంలో రక్త ప్రసరణ తగినంతగా ఉండదని, రక్తనాళాల్లో కొవ్వు ఉన్నవారు వ్యాయామాలు చేస్తున్న క్రమంలో ప్రమాదాలకు గురవుతారని వివరించారు. అప్పుడు సీపీఆర్‌ చేయగలిగితే ప్రాణాలు కాపాడే అవకాశముందని చెప్పారు.

వ్యాయామం చేస్తున్నారా?.. ఇవి తినడం మరవకండి!

మగవారికంటే మహిళల గుండె గట్టిదా? లేడీస్​కు హార్ట్ ప్రాబ్లమ్స్​ ఎందుక తక్కువ?

Last Updated : Jan 29, 2025, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.