ETV Bharat / entertainment

సూపర్​ 'జోడీలు' ఫిక్స్​.. సినిమాల కోసం ఫ్యాన్స్​ వెయిటింగ్​! - cinema

ఎన్టీఆర్‌ కొత్త సినిమాలో ఆయన సరసన రష్మిక ఖాయమైనట్టేనా? బాలకృష్ణ సినిమాలో నటించే భామ ఎవరు? ప్రభాస్‌తో కలిసి ఆడిపాడనున్న ముగ్గురు నాయికల్లో ఇప్పటివరకు ఎంతమంది పక్కా అయినట్టు? ఇలా నాయకానాయికల కలయిక గురించి పరిశ్రమలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. ప్రచారంలో ఉన్న కలయికల సంగతేమో కానీ.. ఇప్పటికే పక్కా అయిన జంటలు సినిమాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓ సారి ఆ జంటలపై లుక్కేద్దాం.

upcoming-telugu-movies-with-super-jodis
upcoming-telugu-movies-with-super-jodis
author img

By

Published : Oct 8, 2022, 6:37 AM IST

ఎన్టీఆర్‌ 30వ సినిమాలో ఆయన సరసన రష్మిక ఖాయమైనట్టేనా? బాలకృష్ణ కొత్త సినిమాలో నటించే భామ ఎవరు? ప్రభాస్‌తో కలిసి ఆడిపాడనున్న ముగ్గురు నాయికల్లో ఇప్పటివరకు ఎంతమంది పక్కా అయినట్టు? ఇలా నాయకానాయికల కలయిక గురించి పరిశ్రమలో నిత్యం చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎవరి పక్కన ఎవరు నటిస్తున్నారనేది వాళ్లిద్దరూ కలిసి కెమెరా ముందుకు వచ్చేవరకు సస్పెన్సే. కొన్నిసార్లు అంతా ఖాయమైనట్టే అనిపించినా ఆఖరి నిమిషంలో మార్పు చేర్పులు జరుగుతుంటాయి. కథానాయకుడు - దర్శకుడు, కథానాయకుడు - నాయిక.. ఇలా కలయికలతోనే సినిమాలకి సగం క్రేజ్‌ లభిస్తుంటుంది. అందుకే జోడీ ముచ్చట్లపై ప్రేక్షకులకు, పరిశ్రమ వర్గాలకి అంత ఆసక్తి. ప్రచారంలో ఉన్న కలయికల సంగతేమో కానీ.. ఇప్పటికే పక్కా అయిన జంటలు సినిమాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

నయా రాధిక.. అనుపమ
'డీజే టిల్లు' సినిమా ప్రేక్షకులకు పసందైన వినోదం పంచింది. టిల్లు, రాధిక పాత్రలు కడుపుబ్బా నవ్వించాయి. ఆ సినిమాకి కొనసాగింపుగా ఇప్పుడు 'డీజే టిల్లు2' తెరకెక్కుతోంది. నయా చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా రాధిక పాత్రలో అనుపమ పరమేశ్వరన్‌ సందడి చేయనుంది. ఈ జోడీ ముచ్చట తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

.
.

కావ్యకు అవకాశం
రవితేజ చేతిలో ఇప్పటికే నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. కొత్తగా మరో రెండు కథలకి పచ్చజెండా ఊపారు. ఒక సినిమా సంపత్‌ నంది దర్శకత్వంలో, మరో సినిమా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో చేయనున్నారు. ఈ రెండింటి కోసం కథానాయికల్ని ఎంపిక చేసే పనిలోనే ఉన్నాయి ఆయా చిత్రబృందాలు. ఇందులో ఓ సినిమాలో కావ్య థాపర్‌ కథానాయికగా ఎంపికయినట్టు తెలుస్తోంది. 'ఏక్‌ మినీ కథ'తో సందడి చేసిన కావ్యథాపర్‌ స్వయంగా, తనకి రవితేజతో జట్టు కట్టే అవకాశం వచ్చిందని సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. రవితేజకి జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ పేరు కూడా కొన్నాళ్ల కిందట ప్రచారంలోకి వచ్చింది. మరి ఏ సినిమాలో ఎవరు నటిస్తారనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

.
.

తొలిసారి..
శర్వానంద్‌ - రాశీ ఖన్నా కలిసి తొలిసారి ఆడిపాడనున్నారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో రాజకీయం నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. అందులోనే రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది. శర్వానంద్‌ నటిస్తున్న 33వ చిత్రమిది. ఈ నెలలోనే చిత్రీకరణ మొదలుకానుంది.

.
.

రామ్‌లీల
నితిన్‌ - శ్రీలీల, వైష్ణవ్‌తేజ్‌ - శ్రీలీల, నవీన్‌ పొలిశెట్టి - శ్రీలీల.. ఈ వరసే చెబుతుంది కొత్త భామ శ్రీలీల జోరు ఎలాంటిదో. 'పెళ్లిసందడి'తో తెలుగు తెరకు పరిచయమైన ఈమె తన అందంతో కట్టిపడేసింది. దాంతో అవకాశాలు వెల్లువెత్తాయి. రవితేజ 'ధమాకా' లోనూ నటిస్తున్న ఆమె తాజాగా మరో అవకాశాన్నీ సొంతం చేసుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్‌ చిత్రంలో ప్రధాన నాయికగా ఎంపికైంది.

.
.

ఇవీ చదవండి: వెట్రిమారన్‌, కమల్‌ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. భాజపా నేతలు ఫైర్​!

బాలీవుడ్​ 'బాద్​షా' భార్య గ్లామరస్​ లుక్స్​ చూశారా?

For All Latest Updates

TAGGED:

cinema
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.