Unstoppable With NBK : నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటీటీలో ప్రసారమైన ఈ సిరీస్.. ఇప్పటివరకు రెండు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకుంది. అయితే ఈ సారి మూడో సీజన్ కాకుండా 'లిమిటెడ్ ఎడిషన్' అనే పేరుతో మళ్లీ ఆహా వేదికగా ప్రసారం 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' కానుంది. ఈ క్రమంలో తొలి ఎపిసోడ్‌లో 'భగవంత్ కేసరి' టీమ్ వచ్చి సందడి చేయనుంది. తాజాగా అనిల్ రావిపూడి, అర్జున్ రాంపాల్, శ్రీలీల, కాజల్ అగర్వాల్ ఉన్న ఓ ప్రోమో కూడా రిలీజైంది.
"మేం తప్పు చేయలేదని మీకు తెలుసు. మేం తలవంచం అని మీకు తెలుసు. మమ్మల్ని ఆపడానికి ఎవడు రాలేడని మీకు తెలుసు." అంటూ బాలయ్య చెప్పే డైలాగ్‌తో ప్రోమో మొదలైంది. ఆ తర్వాత అనిల్- బాలయ్య మధ్య కొన్ని ఫన్నీ డైలాగ్స్‌తో సాగింది. ఇక కాజల్ అగర్వాల్, శ్రీలీల ఎంట్రీతో షో మరింత ఆసక్తిగా మారింది. 'నా చందమామ, అందాల ఆడబొమ్మ' అంటూ కాజల్‌కు వెల్కమ్ చెప్పిన బాలయ్య.. 'డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ... అయితే బాలకృష్ణతో చేయాలి? లేకపోతే శ్రీలీలతో చేయాలి అని అంటున్నారు.' అంటూ శ్రీలీలను పొగడ్తలతో ముంచెత్తారు. ఇలా ప్రోమో ఆద్యంతం ఎంతో ఎనర్జిటిక్‌గా సాగింది. అక్టోబరు 17న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Bhagavanth Kesari Cast : ఇక 'భగవంత్ కేసరి' సినిమా విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్లో నటిస్తున్నారు. అనిల్ తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏమాత్రం మిస్ కాకుండా సినిమాను తీర్చిదిద్దినట్లు సమాచారం. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వీరిద్దరి కలయికలో తొలి సినిమా ఇది. యంగ్ అండ్ బ్యూటీ హీరోయిన్ శ్రీలీలతో పాటు, తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తండ్రీ కూతుర్లుగా కనిపిస్తారని సమాచారం. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు. ''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
Bhagwant Kesari Balakrishna : టాలీవుడ్ సీనియర్ హీరోస్.. ఆ విషయంలో బాలయ్య ముందడుగు!