Unstoppable With NBK Latest Episode : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే'. రెండు సీజన్లు నిర్విరామంగా జరిగిన ఈ షో ప్రస్తుతం లిమిటెడ్ ఎడిషన్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తోంది. ఇప్పటికే 'యానిమల్' మూవీ టీమ్‌తో ఓ ఎపిసోడ్ విడుదలై సందడి చేయగా తాజాగా మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌కు ఎవరు గెస్టులుగా రానున్నారన్న విషయాన్ని తాజాగా ఓ స్పెషల్ వీడియోతో రివీల్ చేశారు. "మిస్టరీ రివీల్ అయిపోయింది. ఇప్పుడీ స్టార్స్ తో అన్‌స్టాపబుల్ సరదాకి మీరు రెడీనా? అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే త్వరలోనే ఆహాలో రాబోతోంది" అనే క్యాప్షన్ తో ఈ ఎపిసోడ్ ప్రోమోను పోస్ట్ చేశారు.
అందులో స్టార్ హీరోయిన్ శ్రియ, సీనియర్ నటి సుహాసిని, డైరెక్టర్ హరీశ్ శంకర్ ఉన్నారు. వీరితో పాటు 'లక్ష్మీ నరసింహ' మూవీ డైరెక్టర్ జయంత్ కూడా ఈ షోలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా బాలయ్య శ్రియ ఉన్న ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇద్దరూ 'చెన్నకేశవ రెడ్డి', 'పైసా వసూల్' సినిమాలో జోడీగా కనిపించి అలరించారు. దీంతో ఈ కాంబోను ఇలా స్క్రీన్‌పై చూడటం ఆనందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా మంగమ్మ గారి మనవడు సినిమాతో ప్రేక్షకులను అలరించిన సుహాసిని బాలయ్య పేయిర్ కూడా ఈ సెట్స్‌పై చూడొచ్చంటూ కామెంట్లు పెడుతున్నారు.
-
#UnstoppableWithNBK Limited Edition Next Episode coming soon🥰
— manabalayya.com (@manabalayya) December 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Guests :
Senior Actress @hasinimani garu 🥰@shriya1109, @harish2you and BlockBuster #LakshmiNarasimha movie Director Jayanth💥#NandamuriBalakrishna pic.twitter.com/0MHICFESqT
">#UnstoppableWithNBK Limited Edition Next Episode coming soon🥰
— manabalayya.com (@manabalayya) December 14, 2023
Guests :
Senior Actress @hasinimani garu 🥰@shriya1109, @harish2you and BlockBuster #LakshmiNarasimha movie Director Jayanth💥#NandamuriBalakrishna pic.twitter.com/0MHICFESqT#UnstoppableWithNBK Limited Edition Next Episode coming soon🥰
— manabalayya.com (@manabalayya) December 14, 2023
Guests :
Senior Actress @hasinimani garu 🥰@shriya1109, @harish2you and BlockBuster #LakshmiNarasimha movie Director Jayanth💥#NandamuriBalakrishna pic.twitter.com/0MHICFESqT
Animal Team In Unstoppable : ఇటీవలే యానిమల్ మూవీ టీమ్ ఈ షోకు వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రామ్‌లో వారి మధ్య జరిగిన కొన్ని ఆసక్తికర సందర్భాల గురించి చెప్పారు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు డైరెక్టర్ సందీప్. 'బాలకృష్ణ సర్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' షోకి వెళ్లినప్పుడు నేను షాక్ అయ్యాను. బాలకృష్ణ అనగానే సీరియస్‌గా ఉంటారని అందరం అనుకుంటాం. కానీ, అక్కడికి వెళ్లిన తర్వాతే ఆయన ఎంత సరదాగా ఉంటారో మాకు తెలిసింది. నిజంగా ఈ షో డిజైన్ చేసిన వాళ్లకి హ్యాట్సాఫ్. రణ్‌బీర్ కపూర్ ముత్తాత చెప్పిన 'మొఘల్ ఎ అజమ్' సంభాషణలు బాలకృష్ణ సర్ చెబుతుంటే నేను ఆశ్చర్యపోయాను. రణ్‌బీర్ కూడా.. 'నాకే ఒక్క డైలాగ్ తెలీదు, ఆయన ఇలా చెప్పారేంటి?' అని షాక్ అయ్యారు.
'అన్‌స్టాపబుల్' సెట్లో రణ్‌బీర్, రష్మిక - స్ట్రీమింగ్ డేట్ వచ్చేసిందోచ్