ETV Bharat / entertainment

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు- క్షమాపణలు చెప్పేది లేదన్న మన్సూర్​- నటికి అండగా మెగాస్టార్! - మన్సూర్ అలీఖాన్ కామెంట్స్ వీడియో

Trisha Mansoor Alikhan : త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. త్రిషకు మద్దతునిస్తూ.. చిరంజీవి స్పందించారు. అలానే మన్సూర్​ను క్షమాపణ చెప్పాలని తమిళ చిత్ర పరిశ్రమ డిమాండ్​ చేసింది. అయితే ఈ విషయంపై మన్సూర్ తాను క్షమాపణలు చెప్పేది లేదని అన్నారు. ఇంకా ఏమన్నారంటే?

Trisha Mansoor Alikhan
Trisha Mansoor Alikhan
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 4:16 PM IST

Trisha Mansoor Alikhan : స్టార్ హీరోయిన్ త్రిషపై 'లియో' నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీటిని ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్​లు పెడుతున్నారు. ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నడిగర్ సంఘం మన్సూర్​పై తాత్కాలిక నిషేధం విధించింది. దీనిని తొలగించాలంటే.. త్రిషకు క్షమాపణ చెప్పాలని స్పష్టం చేసింది.

ఈ విషయంపై మన్సూర్​ స్పందించాడు. "త్రిషకు క్షమాపణలు చెప్పేది లేదు. నడిగర్ సంఘం నిషేధం విధించేముందు నన్ను వివరణ అడిగి ఉంటే బాగుండేదన్నారు. నిషేధం ఎత్తివేసేందుకు నడిగర్​ సంఘానికే కొంత వ్యవధి ఇస్తున్నాను. మీడియా నాకు వ్యతిరేకంగా నచ్చినట్లు రాసుకోవచ్చు. జనాలకు నేనేంటో తెలుసు. తమిళ ప్రజల మద్దుతు నాకు ఉంటుంది. సినిమాల్లో రేప్ సీన్​ అంటే నిజంగా చేస్తారా? అలానే మర్డర్​ సీన్​ అంటే నిజంగా హత్య చేస్తారా? నేనేమి తప్పుగా మాట్లాడలేదు. క్షమాపణలు చెప్పేదీ లేదు." అని మన్సూర్ అలీఖాన్ అన్నారు.

త్రిషకు మద్దతుగా చిరు..
మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ.. త్రిషకు మద్దుతుగా మోగాస్టార్ చిరంజీవి నిలిచారు. ఈ ఘటనపై స్పందించారు. "మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. కేవలం ఆర్టిస్ట్‌లకే కాకుండా స్త్రీలందరికీ అసహ్యం కలిగించేలా ఉన్నాయి. త్రిషకు మాత్రమే కాదు.. ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయి ఎదుర్కొన్నా.. నేను అండగా ఉంటాను." అని చిరంజీవి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్​గా మారింది.

  • My attention was drawn to some reprehensible comments made by actor Mansoor Ali Khan about Trisha.

    The comments are distasteful and disgusting not just for an Artiste but for any woman or girl. These comments must be condemned in the strongest words. They reek of perversion.…

    — Chiranjeevi Konidela (@KChiruTweets) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జాతీయ మహిళా కమిషన్​ సీరియస్​..
మరోవైపు మన్సూర్ అలీఖాన్‌ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ.. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. మహిళల గురించి ఈ విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేదిలేదని తెలిపింది.

  • The National Commission for Women is deeply concerned about the derogatory remarks made by actor Mansoor Ali Khan towards actress Trisha Krishna. We're taking suo motu in this matter directing the DGP to invoke IPC Section 509 B and other relevant laws.Such remarks normalize…

    — NCW (@NCWIndia) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అసలు ఏం జరిగిందంటే.. నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. 'లియో'లో త్రిషతో ఓ సీన్‌ గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. "గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్‌ సీన్లలో నటించా. 'లియో'లో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్‌ లేకపోవడం బాధగా అనిపించింది." అని మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

త్రిష పై 'లియో' నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు - కోలీవుడ్‌ ప్రముఖుల ఆగ్రహం- వివరణ ఇచ్చిన మన్సూర్!

Trisha Second Innings : త్రిష హ్యాట్రిక్ రికార్డు.. 40 ఏళ్లలోనూ తగ్గని క్రేజ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.