ETV Bharat / entertainment

పునీత్ ఆఖరి చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ వేడుక.. గెస్ట్​లుగా చిరు, రజినీ, బిగ్​బీ.. - గంధాడగుడి ప్రీ రిలీజ్ ఈవెంట్

కన్నడ దివంగత స్టార్​ హీరో పునీత్​ రాజ్​కుమార్​ ఆఖరి చిత్రం 'గంధాడగుడి'. ఈ సినిమా ముందస్తు వేడుక ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడకకు దేశంలోని వివిధ భాషలకు చెందిన అగ్ర నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు.

Gandhadagudi pre release event
Gandhadagudi pre release event
author img

By

Published : Oct 10, 2022, 10:57 PM IST

కన్నడ పవర్​ స్టార్​ పునీత్ రాజ్​కుమార్​ ఆఖరి చిత్రం 'గంధాడగుడి' ముందస్తు వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. దీని కోసం పునీత్ భార్య అశ్విని భారీగా ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ఇన్విటేషన్ కార్డును ప్రత్యేకంగా రూపొందించారు.

అయితే ఇది పేరుకే ఇన్విటేషన్​ కార్డు. కానీ ఇది ఒక చెక్కపెట్టెలా ఉంది. అందులో పునీత్​ రాజ్​కుమార్​ విగ్రహం ఉంది. ఆ విగ్రహం కింద్ పునీత్​ స్వహస్తాలతో చేసిని సంతకం గంధపు చెక్కపై ఉంది. ఆ పెట్టె మూతపై ఆయన ఆఖరి చిత్రం 'గంధాడగుడి' పేరు ఉంది. దాని కింద్ పునీత్ సంతకం ఉంది.

ఈ వేడుకకు అన్ని భాషల ప్రముఖ నటీనటులు హాజరు కానున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్, తెలుగు మెగాస్టార్​ చిరంజీవి, సూపర్ స్టార్​ రజినీకాంత్ రానున్నారు. వీరితో పాటు అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, బాలయ్య, తమిల్​ నటుడు విశాల్, శివరాజ్ కుమార్, యశ్, ఉపేంద్ర, ధ్రువ్​ సర్జా, సుమలత అంబరీశ్, రక్షిత్ శెట్టి, పాల్గొనున్నారు. నటులే కాకుండా ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ కూడా హాజరు కానున్నారు.

కర్ణాటకలోని అటవీ సంపద, వైల్డ్​ లైఫ్​ను గంధడగుడిలో చిత్రీకరించారు. వైల్డ్​ లైఫ్​ఫోటోగ్రాఫర్ అమోఘ వర్ష సహకారంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు

ఇవీ చదవండి: 'హరి హర వీరమల్లు' నుంచి మరో అప్డేట్​.. ఫైటర్​ ఫోజులో పవన్ కల్యాణ్

'జిన్నా' నుంచి 'జారు మిఠాయా' సాంగ్... సన్నీ లియోనీ స్టెప్పులు అదుర్స్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.