ETV Bharat / entertainment

Mahesh Babu : జిమ్​లో తెగ కష్టపడుతున్న మహేశ్​.. ఆ సినిమా కోసమేనా..? - మహేశ్​ బాబు వర్కవుట్ రుటీన్ వీడియో

Mahesh Babu Workout Routine : సూపర్​స్టార్​ మహేశ్‌బాబు జిమ్‌లో తెగ కష్టపడుతున్నారు. వివిధ వర్కవుట్‌లు చేస్తున్న వీడియోను శనివారం సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియోలో ఏముందంటే?

Mahesh Babu Gym Video
Mahesh Babu : జిమ్​లో తెగ కష్టపడుతున్న మహేశ్​.. ఆ సినిమా కోసమేనా..?
author img

By

Published : Jul 1, 2023, 10:01 PM IST

Mahesh Babu Workout Routine : సూపర్​స్టార్ మహేశ్​బాబు అనగానే అందరూ మాట్లాడుకునే విషయం ఏదైనా ఉందంటే.. అది ఆయన ఫిట్​నెస్​ గురించే. ఎందుకంటే 47 ఏళ్ల వయసులో కూడా 25 ఏళ్ల యువకుడిలా ఎలా ఫిట్​గా ఉన్నారని ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతారు. అంతలా తన బాడీను మెంటెయిన్​ చేస్తూ వస్తున్నారు సూపర్​స్టార్ మహేశ్​​. ఫిట్​నెస్​కు సంబంధించిన సీక్రెట్​ ఏంటో చెప్పమంటూ మహేశ్​ను అనేక సందర్భాల్లో చాలా మంది అడిగారు. అయితే ఆయన మాత్రం మంచి పోషకాహారంతో కూడిన ఆహారంతో పాటు వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తానని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తన బాడీ ఫిట్​నెస్​కు సంబంధించి జిమ్​లో వర్కవుట్స్​ చేస్తున్న ఓ వీడియోను ఆయన తన ఇన్​స్టా హ్యాండిల్​లో పోస్ట్​ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మీరు ఎన్ని సెట్స్​ చేయగలరు..?
మహేశ్​ పోస్ట్​ చేసిన ఈ వీడియోకు క్యాప్షన్​గా ‘శనివారం మెరుపులు.. ఒక నిమిషం ల్యాండ్‌మైన్‌ ప్రెస్‌, ఒక నిమిషం కెటెల్‌బెల్‌ స్వింగ్స్‌, ఒక నిమిషం స్కిల్‌మిల్‌ రన్‌.. మీరెన్ని సెట్స్‌ చేయగలరు’ అని అభిమానులను ప్రశ్నించారు. ఈ వీడియోలో మహేశ్​ జిమ్​లో ఉండే కొన్ని ఎక్విప్​మెంట్స్​తో ఒక్కో నిమిషం పాటు వర్కవుట్​ చేస్తూ కనిపించారు.

ఆ సినిమా కోసమేనా..?
Mahesh Babu Movies : మహేశ్​బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్త్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం'లో నటిస్తున్నారు​. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్​. ఇక ఈ ప్రాజెక్ట్​ తర్వాత జక్కన్నతో కలిసి త్వరలోనే ఓ పాన్​ ఇండియా చిత్రంలో నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం పూర్తి కథను సిద్ధం చేసేందుకు దర్శకుడు రాజమౌళికి మరో రెండు నెలలు పట్టనుందట. ఆ తర్వాత మహేష్ బాబుకు మరోసారి కథ మొత్తం చెప్పనున్నారని తెలుస్తోంది. ఆ తర్వాత ప్రీ విజువలైజేషన్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారట. ఇక ఈ మూవీ కోసమే మహేశ్​ బాడీ ఫిట్​నెస్​ విషయంలో ఇంతలా కష్టపడుతున్నాడని ఫ్యాన్స్​ అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.